రానా చిత్రంలో హిందీ తార
- IndiaGlitz, [Wednesday,March 06 2019]
ఆరోగ్య కారణాలతో కాస్త గ్యాప్ తీసుకున్న రానా, ఇప్పుడు తన సినిమాల స్పీడు పెంచుతున్నాడు. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందబోయే 'హథీ మేరే సాథీ' చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో రానా సరసన ప్రముఖ బాలీవుడ్ సినీ, టీవీ ఆర్టిస్టులు సచిన్ పిల్గావ్కర్, సుప్రియ పిల్గావ్కర్ల తనయ శ్రేయా పిల్గావ్కర్ నటించనుంది.
ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. మీర్జాపూర్ వెబ్ సిరీస్లో నటించిన శ్రేయా పిల్గావ్కర్ నటిగా గుర్తింపు పొందారు. వెండితెరపై ఈమె నటిస్తున్న తొలి చిత్రమిది. 1971లో విడుదలైన 'హథీ మేరే సాథీ' సినిమాకు రీమేక్ ఇది.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో రానా యాభై ఏళ్ల వ్యక్తి పాత్రలో కనిపిస్తాడట. తెలుగు, తమిళ వెర్షన్లో విష్ణు విశాల్ ఓ కీలక పాత్రలో నటిస్తుంటే.. అదే పాత్రను హిందీ వెర్షన్లో పుల్కిత్ సమ్రాట్ చేస్తున్నాడు.