దుబాయ్ లో 3 పాట‌లు పూర్తి చేసుకున్న హిమాల‌య స్టూడియో మేన్ష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం

  • IndiaGlitz, [Wednesday,March 10 2021]

స్టార్ హీరోలు, భారీ బ‌డ్జెట్ చిత్రాలు త‌ప్ప మీడియం చిత్రాలు ఇటీవ‌ల కాలంలో విదేశాల్లో షూటింగ్ జ‌రుపుకున్న సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. అందులో క‌రోనా త‌ర్వాత విదేశాల‌కు వెళ్లాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. ఇలాంటి క్ర‌మంలో హిమాల‌య మేన్ష‌న్స్ అధినేత పి.ఉద‌య్ కిర‌ణ్‌, నూత‌న ద‌ర్శ‌కుడు సురేష్ ధైర్యంగా ముంద‌డుగేసి ఇటీవ‌ల దుబాయ్‌లో దాదాపు ప‌ది రోజుల‌కు పైగా అక్క‌డే ఉండి మూడు పాట‌లు విజ‌య‌వంతంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్నారు‌. సాయి రోన‌క్‌, నేహ సోలంకి హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత పి.ఉద‌య్ కిర‌ణ్ మాట్లాడుతూ...''ఇటీవ‌ల మా టీమ్ దాదాపు 30 మందికి పైగా దుబాయ్ వెళ్లాము. దుబాయ్ తో పాటు షార్జా లో అంద‌మైన లొకేష‌న్స్ లో మూడు పాట‌లు చిత్రీక‌రించాము. కొవిడ్ కి సంబంధించిన‌ జాగ్ర‌త్త‌లు అన్నీ పాటిస్తూ చిత్ర యూనిట్ స‌హ‌కారంతో అనుకున్న విధంగా ఈ షెడ్యూల్ పూర్తి చేయ‌గ‌లిగాం. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో ఓ సెల‌బ్రిటీ చేతుల మీదుగా మా సినిమాకు సంబంధించిన టైటిల్, ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.

ద‌ర్శ‌కుడు సురేష్ మాట్లాడుతూ...'' ఈ ప్రేమ క‌థా చిత్రానికి ఇప్ప‌టి వ‌ర‌కు మా నిర్మాత ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా క‌థ డిమాండ్ ని బ‌ట్టి ఖ‌ర్చు పెడుతున్నారు. అందులో భాగంగానే ఇటీవ‌ల దుబాయ్‌లో మూడు పాట‌లు గ్రాండ్ గా చిత్రీక‌రించాము. భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన అద్భుత‌మైన పాట‌ల‌కు మాస్ట‌ర్ వెంక‌ట్ దీప్ అదే స్థాయిలో కొరియోగ్రఫీ చేశారు '' అన్నారు.

శ‌శాంక్, సిజ్జు, అలీ, నాగినీడు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘుబాబు, హేమ‌, ర‌ఘు, తాగుబోతు ర‌మేష్‌, అనంత్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః భీమ్స్ సిసిరోలియో ; సాహిత్యం: సురేష్ గంగుల, దేవ్; ఎడిటింగ్ః ఉపేంద్ర‌; ఆర్ట్ డైర‌క్ట‌ర్ః రామాంజ‌నేయులు; పిఆర్వోః బాక్సాఫీస్ మీడియా; సినిమాటోగ్ర‌ఫీః అజిత్ వి.రెడ్డి, జ‌య‌పాల్ రెడ్డి; నిర్మాతః పి.ఉద‌య్ కిర‌ణ్‌, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః సురేష్‌.

More News

2016-2020 మధ్య ఎంతమంది పార్టీ మారారో తెలిస్తే..

దేశవ్యాప్తంగా పార్టీలు మారిన వారిపై అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) ఓ సర్వే చేపట్టింది. ముఖ్యంగా 2016-2020 మధ్య జరిగిన వివిధ ఎన్నికల్లో ఏ ఏ పార్టీలకు చెందిన ఎంతమంది

విశాఖ ఉక్కు పోరుకు మెగాస్టార్ మద్దతు.. తీవ్ర స్థాయిలో విమర్శలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై టాలీవుడ్ తరుఫున మెగాస్టార్ చిరంజీవి స్పందించిన విషయం తెలిసిందే. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన తన గళం విప్పారు.

ఇకపై కొత్త చట్టంతో వస్తున్న సైబరాబాద్ పోలీస్.. తస్మాత్ జాగ్రత్

ఇప్పటి వరకూ ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మందు బాబులు మాత్రం మద్యం సేవించి వాహనాలు నడపడం మానడం లేదు. ఎప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినా పెద్ద సంఖ్యలో కార్లు, బైక్స్ పట్టుబడుతూనే ఉన్నాయి.

శివరాత్రి రోజున ‘హరిహర వీరమల్లు’గా పవన్ ఎంట్రీ..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ సారి ‘హరిహర వీరమల్లు’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో రాబోతున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ని శివరాత్రి కానుకగా నేడు విడుదల చేశారు.

విశాఖ ఉక్కుకు మద్దతు ప్రకటిస్తూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై టాలీవుడ్ విమర్శలను ఎదుర్కొ&#