మొదటి మహిళ హైకోర్టు సీజేగా హిమా కోహ్లీ ప్రమాణం..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా హిమా కోహ్లీ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీతో గవర్నర్ తమిళ సై ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవలే తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా హిమా కోహ్లీ నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ చౌహాన్.. జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అవడంతో ఆయన స్థానంలో హిమా కోహ్లీని నియమించారు. కాగా.. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ రికార్డు సృష్టించారు.
హిమా కోహ్లీ విద్యాభ్యాసమంతా ఢిల్లీలోనే..
జస్టిస్ హిమా కోహ్లీ 1959 సెప్టెంబరు 2న ఢిల్లీలో జన్మించారు. ఆమె విద్యాభ్యాసమంతా ఢిల్లీలోనే కొనసాగింది. ఢిల్లీలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎంఏ(హిస్టరీ) చేశారు. అనంతరం ఆమె న్యాయశాస్త్రం చదివారు. 1984లో లా డిగ్రీ పొంది, అదే సంవత్సరం ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. 1999- 2004 మధ్య ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్‌కు హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్‌గా, న్యాయ సలహాదారుగా వ్యవహరించారు. ఢిల్లీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యులుగా చేశారు.
2006 మే 29న ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా హిమా కోహ్లీ నియమితులయ్యారు. అనంతరం 2007 ఆగస్టు 29న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది మే 20 నుంచి ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, ఈ ఏడాది జూన్ 30 నుంచి నేషనల్ లా యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా తెలంగాణ మొదటి మహిళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులై నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout