ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ
- IndiaGlitz, [Friday,November 22 2019]
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీలో 5100 బస్సులను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలని కేసీఆర్ క్యాబినేట్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది.
కాగా.. మొదట్నుంచి సీఎం కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసి తీరుతానని ఒకే మాట మీదే ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఒకట్రెండు కాదు.. సుమారు 45 రోజులకు పైగా కార్మికులు సమ్మె చేపట్టారు. చివరికి ఆర్టీసీని ఆదర్శ ప్రభుత్వ సంస్థగా చూడాలని.. డిమాండ్స్‌ను వెనక్కి తీసుకొని.. సమ్మెను విరమింపజేస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఓ ప్రకటనలో చెప్పారు.
అయితే కేసీఆర్ మాత్రం వెనక్కి తగ్గేది లేదని హైకోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ప్రకటించగా.. అనుకున్నట్లే తీర్పు వచ్చింది.