సూర్య 24 లో హైలెట్ అదే..
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య నటిస్తున్న తాజా చిత్రం 24. ఈ చిత్రాన్ని మనం ఫేం విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో సూర్య మూడు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. ఒక పాత్ర నార్మల్ గా ఉంటుంది. మిగిలిన రెండు పాత్రలు ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో ఉన్న పాత్రలు. ఫ్రెంచ్ గడ్డంతో ఉన్న పాత్ర విలన్ పాత్ర.
ఈ పాత్ర పేరు ఆత్రేయ. ఇప్పటి వరకు ఇండియన్ సినీ చరిత్రలోనే ఇలాంటి విలన్ పాత్ర రాలేదని డైరెక్టర్ విక్రమ్ కుమార్ చెబుతున్నారు. సినిమా రిలీజ్ తర్వాత అందరు ఈ పాత్ర గురించే మాట్లాడుకునేలా ఉంటుందట. సూర్య సరసన సమంత, నిత్యామీనన్ నటిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 13 బి, ఇష్క్, మనం...ఇలా డిఫరెంట్ మూవీస్ అందించే విక్రమ్ కుమార్ 24 మూవీతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనున్నాడో తెలియాలంటే సమ్మర్ వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com