అ ఆ హైలైట్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో నితిన్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం అ ఆ. నితిన్, సమంత జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మించారు. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన అ ఆ చిత్రాన్ని ఈనెల 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన అ ఆ అన్నివర్గాల ప్రేక్షకులను అలరించి ఘన విజయాన్ని సాధిస్తుందన్న టాక్ ఉంది.
ఇక ఈ చిత్రంలోని హైలైట్స్ విషయానికి వస్తే...నితిన్, సమంత మధ్య లవ్ ట్రాక్ యూత్ ను బాగా ఆకట్టుకుని ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది అంటున్నారు. అలాగే త్రివిక్రమ్ పంచ్ డైలాగులు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పటిలాగే త్రివిక్రమ్ డైలాగులు చాలా ఫ్రెష్ గా..మీనింగ్ ఫుల్ గా ఉంటాయి. అనుపమ పరమేశ్వరన్, రావు రమేష్ ల పై చిత్రీకరించిన సన్నివేశాలు, పోసాని నెగిటివ్ రోల్, మిక్కీ జే మేయర్ మ్యూజిక్ హైలైట్స్ గా నిలుస్తాయని టాక్. మరి...అ ఆ అంచనాలను అందుకుని ఘన విజయం సాధిస్తుందని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments