అత్యున్నత సాంకేతికతో ప్రభాస్ ఆదిపురుష్.. ముహూర్తం ఫిక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పీడు పెంచేశాడు. ఎంత స్పీడంటే ఇతర టాలీవుడ్ హీరోలే కాదు, బాలీవుడ్ స్టార్స్ కూడా షాక్ అయ్యేంత స్పీడుగా ప్రభాస్ వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. కోవిడ్ ప్రభావ సమయంలో స్పీడు తగ్గించిన ప్రభాస్.. ఇప్పుడు డబుల్ స్పీడుతో వెళుతున్నాడు. ప్రభాస్ స్పీడు చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఇప్పటికే రాధేశ్యామ్ షూటింగ్‌ను ప్యాచ్ వర్క్ మినహా పూర్తి చేసిన ప్రభాస్.. రీసెంట్‌గానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్'ను షురూ చేశాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పుడు మరో సినిమాను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ప్రభాస్ రెడీ అయిపోయాడు. ఆ సినిమాయే 'ఆదిపురుష్'. ఈ సినిమాను ఫిబ్రవరి 2న లాంఛనంగా ప్రారంభించనున్నారు.
మంగళవారం ఈ సినిమాకు సంబంధించి మోషన్ క్యాప్చర్స్ టెక్నాలజీలో కటింగ్ ఎడ్జ్ మెథడ్‌ను ఉపయోగిస్తున్నాడు. ఇంటర్నేషనల్ సినిమాల్లో ఈ టెక్నాలజీని వాడుతారు. దానికి సంబంధించిన పనులు ఈరోజు స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ ఓంరావుత్ అధికారికంగా ప్రకటించారు. రామాయణంను ఆదిపురుష్ అనే పేరుతో ఓంరావుత్ తెరకెక్కిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న సినిమాను విడుదల చేస్తామని ముందుగానే ఓం రావుత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ఈ ఏడాదిలోనే సలార్‌తో పాటు ఆదిపురుష్ సినిమాను పూర్తి చేసేస్తాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com