గోపీచంద్ కెరీర్ లో భారీ మొత్తానికి శాటిలైట్...
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ హంక్ గోపీచంద్ ఇప్పుడు సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న సినిమా `గౌతమ్ నంద`. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. స్టయిలిష్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాలో గోపీచంద్ రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు.
ఈ సినిమా బిజినెస్ పరంగా గోపీచంద్ కెరీర్లోనే హయ్యస్ట్ బిజినెస్‌ను చేస్తుందట. శాటిలైట్ హక్కుల విషయంలో కూడా ఓ ప్రముఖ ఛానెల్ ఐదు కోట్లు పెట్టి సినిమాను దక్కించుకుందట. గోపీచంద్ కెరీర్లోనే ఎక్కువ మొత్తంలో శాటిలైట్ హక్కులు దక్కించుకున్న చిత్రమిదే కావడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com