‘జై భీమ్’ సినిమా: సూర్యకు బెదిరింపులు.. చెన్నై పోలీసులు అప్రమత్తం
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ హీరో స్టేటస్‌ను పక్కనబెట్టి మరి వైవిధ్యభరితమైన చిత్రాలు, కథలతో గుర్తింపు తెచ్చుకున్నారు సూర్య. ఇటీవల ఆయన హీరోగా తెరకెక్కిన చిత్రం జైభీమ్. వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈచిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. అయితే జైభీమ్‌కి కొన్ని వివాదాలు సైతం వెంటాడుతున్నాయి.
తాజాగా జై భీమ్ చిత్రంలో మతపరమైన చిహ్నాన్ని కలిగి ఉన్న సన్నివేశంపై ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. జై భీమ్ చిత్ర నిర్మాత దర్శకుడి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీఎంకె మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్ సెల్వం అక్కడి పోలీసు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. అంతకుముందు నవంబర్ 15న వన్నియార్ సంఘం ప్రతిష్టను దిగజార్చారు అంటూ ‘జై భీమ్’ చిత్రబృందం సూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు వన్నియార్ సంఘం లీగల్ నోటీసు పంపింది. దీని తరువాత సూర్యకు సైతం అనేక బెదిరింపులు రావడంతో తమిళనాడు పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం చెన్నై టి నగర్‌లోని సూర్య నివాసం వద్ద ఐదుగురు పోలీసులు ఆయుధాలతో సూర్యకు భద్రతను కల్పిస్తున్నారు.
మరోవైపు ‘జై భీమ్’ విడుదలైన అన్ని భాషల్లో కలిసి ఇప్పటివరకు 40 కోట్లు రాబట్టుకుందనే వార్తలు వస్తున్నాయి. నాలుగు రేట్ల లాభం పొందటం పట్ల ఆ సంస్థ సూర్యతో మరో సినిమాను కూడా డీల్ చేసే పనిలో ఉందట..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments