కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు సీరియస్..
- IndiaGlitz, [Monday,July 27 2020]
కరోనా కేసుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్న హైకోర్టు.. నేడు మరోసారి మండిపడింది. కరోనా కేసుల విసయంలో తమ ఆదేశాలు ఒక్కటి కూడా అమలు కాకపోవడంపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. జూన్ 8 నుంచి తాము చేస్తున్న ఆదేశాల పట్ల తెలంగాణ ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం దురదృష్టకరమని పేర్కొంది. అసలు తమ ఆదేశాలు అమలు సాధ్యం కాకపోతే ఎందుకు కాదో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ఆదివారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్‌లో కూడా సరైన వివరాలు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై రేపు సీఎస్‌నే ప్రశ్నిస్తామని హైకోర్టు తెలిపింది. కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.