సహనాన్ని పరీక్షించొద్దు: కరోనా విషయమై హైకోర్టు ఫైర్

  • IndiaGlitz, [Monday,July 20 2020]

తెలంగాణలో కరోనా వైరస్ విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సహనాన్ని పరీక్షించొద్దని.. ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పించింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. హెల్త్ బులిటెన్‌లో సమగ్ర వివరాలు ఉండాలని.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ్య వెబ్‌సైట్ పునరుద్ధరించాలని ఆదేశించింది. ఈ నెల 28న చీఫ్ సెక్రటరీ, వైద్యారోగ్య కార్యదర్శి న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షల్లో తెలంగాణ చాలా వెనుకబడి ఉందని హైకోర్టు పేర్కొంది. ఓ వైపు కేసులు పెరిగిపోతుంటే మొద్దు నిద్రేంటని ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. బులిటెన్‌తో పాటు బెడ్‌ల వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచి తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడింది. ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసి వాట్సాప్ నంబర్ గురించి అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించింది. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు ఎక్కువ మంది హాజరుకాకుండా చూడాలని సూచించింది. కరోనా విషయంలో హైకోర్టు అభినందించిందంటూ బులిటెన్‌లో పేర్కొనడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాల అమలుకు చివరి అవకాశం ఇస్తున్నట్టు తెలిపింది.

More News

ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. వారికే పదవులు!

ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. మంత్రి వర్గ విస్తరణపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది.

ఏపీలో 53 వేలు దాటిన కరోనా కేసులు.. నేడు ఎన్నంటే..

ఏపీ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ఆదివారంతో పోలిస్తే నేడు కొంచెం కరోనా కేసులు తగ్గాయి.

నా పెళ్లికి రండి: కేసీఆర్‌కు నితిన్ ఆహ్వానం

ఎంతో వైభవంగా పెళ్లి చేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ కరోనా ఎందరో ఆశలపై నీళ్లు జల్లింది.

వెబ్ సిరీస్ ఆలోచ‌న‌ల్లో సందీప్ వంగా..?

తొలి చిత్రం `అర్జున్ రెడ్డి`తో తెలుగులో భారీ హిట్‌ను సొంతం చేసుకున్నాడు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా.

మ‌ణిర‌త్నం ‘న‌వ‌ర‌స‌’లో టాలీవుడ్ స్టార్స్‌..?

ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్స్‌లో మ‌ణిర‌త్నం పేరు ఎప్పుడూ టాప్‌లో ఉంటుంది. ఈ ద‌ర్శ‌క నిర్మాత ఓ వెబ్ సిరీస్‌ను రూపొందించే ప్ర‌య‌త్నాల్లో