సహనాన్ని పరీక్షించొద్దు: కరోనా విషయమై హైకోర్టు ఫైర్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో కరోనా వైరస్ విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సహనాన్ని పరీక్షించొద్దని.. ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పించింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. హెల్త్ బులిటెన్‌లో సమగ్ర వివరాలు ఉండాలని.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ్య వెబ్‌సైట్ పునరుద్ధరించాలని ఆదేశించింది. ఈ నెల 28న చీఫ్ సెక్రటరీ, వైద్యారోగ్య కార్యదర్శి న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షల్లో తెలంగాణ చాలా వెనుకబడి ఉందని హైకోర్టు పేర్కొంది. ఓ వైపు కేసులు పెరిగిపోతుంటే మొద్దు నిద్రేంటని ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. బులిటెన్‌తో పాటు బెడ్‌ల వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచి తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడింది. ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసి వాట్సాప్ నంబర్ గురించి అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించింది. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు ఎక్కువ మంది హాజరుకాకుండా చూడాలని సూచించింది. కరోనా విషయంలో హైకోర్టు అభినందించిందంటూ బులిటెన్‌లో పేర్కొనడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాల అమలుకు చివరి అవకాశం ఇస్తున్నట్టు తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments