ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
Send us your feedback to audioarticles@vaarta.com
నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయమై ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని.. అక్కడ దీనిపై పలు మార్లు విచారణ జరిగినప్పటికీ సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని రమేష్ కుమార్ తరుఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.
రమేష్ కుమార్‌ను ఎస్ఈసీగా ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రమేష్ కుమార్ వెళ్లి గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని సూచించింది. హైకోర్టు ఆదేశాలకు మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం గవర్నర్‌కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout