ఏపీ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు సీరియస్..

  • IndiaGlitz, [Tuesday,November 03 2020]

ఏపీ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు సీరియస్ అయింది. ఎన్నికల కమిషన్‌కు ఏపీ ప్రభుత్వం సహకరించట్లేదని గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమ్మగడ్డ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం, నిమ్మగడ్డ తరపు వాదనలను విన్న అనంతరం హైకోర్టు.. ఏపీ ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. నిజాయితీగా పనిచేసే అధికారులను ఇబ్బందులకు గురిచేయటం మంచికాదని సూచించింది.

కాగా ఈ కేసును ఎన్నికల కమిషన్ తరపున సీనియర్ అడ్వకేట్లు సీతారామ్మూర్తి, అశ్వనీకుమార్ వాదించారు. తనకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లి న్యాయంగా పదవి పొందిన వ్యక్తిని ప్రభుత్వం ఇబ్బందిపెడుతోందని.. కావాలనే ఎస్ఈసీకి సహాయ సహకారాలందించడం లేదని కోర్టుకు తెలిపారు. ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ అని... దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషన్ స్వతంత్ర వ్యవస్థ అని.. నిరంతరంగా పనిచేసేదని స్పష్టం చేసింది.

ప్రభుత్వం సహాయమందిస్తే కోర్టును ఎస్ఈసీ ఆశ్రయించే అవకాశం ఉండేది కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎస్ఈసీ ఎన్ని విజ్ఞప్తులు చేసినా మీరెందుకు స్పందించలేదని ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి ఏం కావాలో ఎస్ఈసీ మూడ్రోజుల్లోగా ప్రభుత్వానికి తెలియచేయాలని కోర్టు తెలిపింది. ఎస్ఈసీ కోరినవన్నీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. అంతేకాదు.. అమలు చేసిన కాపీని సైతం కోర్టుకు సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

More News

నోయెల్ రీఎంట్రీ.. షాక్ ఇస్తున్న వీడియో..

‘బిగ్‌బాస్’ ఏదైనా జరగొచ్చు అని ఎప్పుడో చెప్పేశారు. ఇక అంతా అయిపోయింది. సింగర్ నోయెల్‌కు సెండాఫ్ కూడా ఇచ్చేశారు.

ఇటు చిరు.. అటు రజినీ.. దక్షిణాదిలో సినీ ప్రముఖులే టార్గెట్..

సూపర్‌స్టార్ రజినీకాంత్ కాషాయ తీర్థం తీసుకోబోతున్నారంటూ ఎప్పటి నుంచో ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి.

ప‌వ‌న్ చిత్రంలో మ‌రో హీరోయిన్ కూడా ఖ‌రారైందా..?

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది.

`రాధేశ్యామ్` నుండి తిరిగొచ్చేసిన పూజాహెగ్డే..

`రాధేశ్యామ్` నుండి పూజా హెగ్డే తిరిగొచ్చేసిందా! అంటే అవును నిజ‌మే అనాలి.

'ఆర్ఆర్ఆర్‌`లో జ‌లియ‌న్ వాలాభాగ్‌

జలియ‌న్ వాలాభాగ్ ఘ‌ట‌న అన‌గానే ఎవ‌రికైనా స్వాతంత్ర్యానికి ముందు జ‌న‌ర‌ల్ డ‌య్య‌ర్ ప్ర‌జ‌ల‌పై అకృత్యంగా చేసిన కాల్పుల ఘ‌ట‌నే గుర్తుకు వ‌స్తుంది.