ఆర్టీసీ సమ్మె విచారణపై హైకోర్టు సంచలన నిర్ణయం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె వ్యవహారానికి ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడేలా లేదు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం, కార్మికుల తరఫున లాయర్లు వాదోపవాదనలు నడిచినప్పటికీ కొలిక్కి రాలేదు. అయితే సోమవారం సాయంత్రం మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సుధీర్ఘంగా సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ విచారణ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ విచారణలో భాగంగా హైకోర్టు కీలక నిర్ణయమే తీసుకుంది.
రెండు వారాలే గడువు!
రెండు వారాల్లోగా సమస్యను పరిష్కరించాలని కార్మికశాఖ కమిషనర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విషయంలో మాత్రం కోర్టుకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టుకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని, అందుకే చర్చలు జరపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించలేమని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ‘హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి. పరిధి దాటి ముందుకు వెళ్లలేం. విషయాన్ని కార్మిక న్యాయస్థానం చూసుకుంటుంది. రెండు వారాల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని సూచిస్తున్నాం. సమ్మెపై లేబర్ కోర్టుకు వెళ్లాలో, వద్దో రెండు వారాల్లో లేబర్ కమిషనర్ ఓ నిర్ణయం తీసుకోవాలి. సమ్మె అక్రమమో, సక్రమమో నిర్ణయం తీసుకోగలిగే విచక్షణాధికారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉంది’ అని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments