ఆర్టీసీ సమ్మె విచారణపై హైకోర్టు సంచలన నిర్ణయం

  • IndiaGlitz, [Monday,November 18 2019]

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె వ్యవహారానికి ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడేలా లేదు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం, కార్మికుల తరఫున లాయర్లు వాదోపవాదనలు నడిచినప్పటికీ కొలిక్కి రాలేదు. అయితే సోమవారం సాయంత్రం మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సుధీర్ఘంగా సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ విచారణ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ విచారణలో భాగంగా హైకోర్టు కీలక నిర్ణయమే తీసుకుంది.

రెండు వారాలే గడువు!

రెండు వారాల్లోగా సమస్యను పరిష్కరించాలని కార్మికశాఖ కమిషనర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విషయంలో మాత్రం కోర్టుకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టుకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని, అందుకే చర్చలు జరపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించలేమని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ‘హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి. పరిధి దాటి ముందుకు వెళ్లలేం. విషయాన్ని కార్మిక న్యాయస్థానం చూసుకుంటుంది. రెండు వారాల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని సూచిస్తున్నాం. సమ్మెపై లేబర్ కోర్టుకు వెళ్లాలో, వద్దో రెండు వారాల్లో లేబర్ కమిషనర్ ఓ నిర్ణయం తీసుకోవాలి. సమ్మె అక్రమమో, సక్రమమో నిర్ణయం తీసుకోగలిగే విచక్షణాధికారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉంది’ అని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

More News

రానా సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్ మారాడు

`బాహుబ‌లి`, `నేనే రాజు నేనే మంత్రి` వంటి వైవిధ్యమైన క‌థా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి ఆరోగ్య కార‌ణాల‌తో కొన్ని రోజుల పాటు విశ్రాంతిని తీసుకున్నాడు.

‘జార్జిరెడ్డి’ మూవీ యూనిట్ డ్రామాలాడుతోందా..!?

సందీప్ మాధ‌వ్ టైటిల్ పాత్రలో న‌టించిన చిత్రం ‘జార్జ్‌రెడ్డి’. జీవ‌న్ రెడ్డి ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఈ న‌వంబ‌ర్ 22న విడుద‌ల కానున్న విషయం తెలిసిందే.

అడ‌విలో మ‌హేశ్ ఫైట్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. సినిమా ఇప్పుడు తుది దశ చిత్రీకరణకు చేరుకుంది.

రాజ్‌ మాదిరాజు 'సిరా' పుస్కకావిష్కరణ

విద్యావ్యవస్థలో లోపాలను, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని, వాళ్ళ ఆత్మహత్యలకు గల కారణాలను విశ్లేషిస్తూ...

సూపర్ స్టార్ తో 'దర్బార్' చేయడం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్: ఏ ఆర్ మురుగదాస్

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `దర్బార్`.