Chandrababu Babu:చంద్రబాబు వెంట డీఎస్పీలు పెట్టాలన్న సీఐడీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై అదనపు షరతులు విధించాలంటూ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెల్లడించింది. స్కిల్ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడవద్దని, రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. అయితే చంద్రబాబు కార్యక్రమాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థనను మాత్రం తిరస్కరించింది. సీఐడీ పిటిషన్‌పై బుధవారం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది. అక్టోబర్ 31న చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే కొన్ని షరతులు విధించింది. ఈ షరతులతో పాటు మరికొన్ని షరతులు విధించాలని సీఐడీ అధికారులు పిటిషన్ వేశారు.
ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు..
ఇక వైద్య పరీక్షల కోసం గురువారం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన చంద్రబాబు డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రికి వెళ్లిన ఆయన కంటికి కాటరాక్ట్ శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. ఒక్కరోజు పాటు ఏఐజీ ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు జనరల్ మెడిసిన్‌తో పాటు కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాల నిపుణుల బృందం చంద్రబాబును పరీక్షించి వివిధ పరీక్షలు సూచించింది. రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ, 2డీఎకో, కాలేయ, మూత్రపిండాల పనితీరు, అలర్జీ స్క్రీనింగ్ ఇతర టెస్టులు చేసినట్లు తెలుస్తోంది.
అటు జైలు నుంచి విడుదలైన చంద్రబాబుపై వరుస కేసులు నమోదవుతున్నాయి. తాజాగా టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదైంది. ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయంటూ ఏపీఎండీసీ(APMDC) డైరెక్టర్ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు పెట్టారు. ఈ కేసులో ఏ-1గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-౩గా చింతమనేని ప్రభాకర్, ఏ-4గా దేవినేని ఉమను చేర్చారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేలా వ్యవహరించారంటూ వెంకటరెడ్డి ఫిర్యాదుచేశారు.
చంద్రబాబుపై నమోదైన కేసులను పరిశీలిస్తే..
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు
ఏపీ ఫైబర్ నెట్
మద్యం పాలసీ
ఇసుక అక్రమాలు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout