Chandrababu Babu:చంద్రబాబు వెంట డీఎస్పీలు పెట్టాలన్న సీఐడీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు

  • IndiaGlitz, [Friday,November 03 2023]

టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై అదనపు షరతులు విధించాలంటూ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెల్లడించింది. స్కిల్‌ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడవద్దని, రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. అయితే చంద్రబాబు కార్యక్రమాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థనను మాత్రం తిరస్కరించింది. సీఐడీ పిటిషన్‌పై బుధవారం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది. అక్టోబర్ 31న చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే కొన్ని షరతులు విధించింది. ఈ షరతులతో పాటు మరికొన్ని షరతులు విధించాలని సీఐడీ అధికారులు పిటిషన్ వేశారు.

ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు..

ఇక వైద్య పరీక్షల కోసం గురువారం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన చంద్రబాబు డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రికి వెళ్లిన ఆయన కంటికి కాటరాక్ట్‌ శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. ఒక్కరోజు పాటు ఏఐజీ ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు జనరల్ మెడిసిన్‌తో పాటు కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాల నిపుణుల బృందం చంద్రబాబును పరీక్షించి వివిధ పరీక్షలు సూచించింది. రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ, 2డీఎకో, కాలేయ, మూత్రపిండాల పనితీరు, అలర్జీ స్క్రీనింగ్ ఇతర టెస్టులు చేసినట్లు తెలుస్తోంది.

అటు జైలు నుంచి విడుదలైన చంద్రబాబుపై వరుస కేసులు నమోదవుతున్నాయి. తాజాగా టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదైంది. ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయంటూ ఏపీఎండీసీ(APMDC) డైరెక్టర్‌ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు పెట్టారు. ఈ కేసులో ఏ-1గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-౩గా చింతమనేని ప్రభాకర్‌, ఏ-4గా దేవినేని ఉమను చేర్చారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేలా వ్యవహరించారంటూ వెంకటరెడ్డి ఫిర్యాదుచేశారు.

చంద్రబాబుపై నమోదైన కేసులను పరిశీలిస్తే..

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు
ఏపీ ఫైబర్ నెట్
మద్యం పాలసీ
ఇసుక అక్రమాలు

More News

రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి తిట్ల పురాణం సోషల్ మీడియాలో వైరల్..

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. అయితేకాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..

జీ5లో 50 మిలియ‌న్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ రాబట్టిన 'ప్రేమ విమానం'

దేశ వ్యాప్తంగా వైవిధ్యమైన కంటెంట్‌తో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను కోరుకునే ప్రేక్షకుల‌ను మెప్పిస్తోన్న వ‌న్ అండ్ ఓన్లీ ఓటీటీ జీ5. తాజాగా అక్టోబ‌ర్ 13 నుంచి 'ప్రేమ విమానం’

CM Jagan:సుప్రీంకోర్టులో ఏపీ సీఎం జగన్‌కు షాక్.. అక్రమాస్తుల కేసులో సీబీఐకి నోటీసులు..

ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డికి సుప్రంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జగన్‌ అక్రమాస్తుల కేసులపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన

'కాలింగ్ సహస్త్ర' అంటున్న సుడిగాలి సుధీర్.. న‌వంబ‌ర్‌లో విడుద‌ల‌

బుల్లి తెర ప్రేక్షకుల‌ను అల‌రించి తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై కూడా అభిమానులను మెప్పిస్తున్నారు.

సామాజిక రథ చక్రాలు వస్తున్నాయి.. వైసీపీ బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే..

ఎన్నికలు వేళ నిత్యం ప్రజల్లో ఉండేందుకు అధికార వైసీపీ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరైన వైసీపీ..