కరోనా విషయమై అధికారులపై హైకోర్టు ప్రశ్నల వర్షం
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్రంలో కరోనా వ్యవహారంపై హైకోర్టులో నేడు కూడా విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు నేడు చీఫ్ సెక్రటరీ, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డిహెచ్ఎంవో, జీహెచ్ఎంసీ కమిషనర్ కోర్టుకు హాజరయ్యారు. కరోనా విషయమై దాఖలైన అన్ని ప్రజాప్రయోజనాలన్నింటినీ కలిపి ఏక కాలంలో హైకోర్టు విచారణ జరుపుతోంది. కరోనా హైదరాబాద్ నుంచి మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించిందని.. అక్కడ ప్రజలు మరణిస్తున్నారని.. నియంత్రణకు తీసుకున్న చర్యలేంటని హైకోర్టు ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఎందుకు అంత తక్కువగా చేస్తున్నారని మండిపడింది. డబ్యూహెచ్ఓ, ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ మేరకు మూడున్నర లక్షలకు పైగానే టెస్టులు చేశామని సీఎస్ కోర్టుకు తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆక్సీజన్ అందక 38 మంది చనిపోయారని కోర్టు పేర్కొంది. ‘‘పాజిటివ్ కేసులు పెరుగుతున్నా.. నివారణ, నియంత్రణ ఎందుకు చేపట్టట్లేదు? కరోనా బులిటెన్‌లో తప్పుల తడకలేంటి? గాంధీలో అసలు టెస్టులు నిర్వహిస్తున్నారా?’’ అంటూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది. తమ ఆదేశాలనెందుకు పట్టించుకోవట్లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ లో 1085 కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేశామని చీఫ్ సెక్రటరీ తెలిపారు. నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో కూడా చికిత్స చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout