‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ రిలీజ్‌కు హైకోర్ట్ బ్రేక్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంచలన చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. రేపు అనగా.. నవంబర్ 29న రిలీజ్ చేస్తామని చిత్రబృందం చెప్పినప్పటికీ.. విడుదలపై మాత్రం అనేక అనుమానాలు వస్తున్నాయి. అయితే ఆ అనుమానాలన్నీ నిజమయ్యాయి. సినిమా రిలీజ్‌కు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. దీంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. గురువారం నాడు ఈ సినిమాపై అందిన పిటిషన్‌లను విచారించిన హైకోర్టు.. సినిమా రిలీజ్‌ను ఆపాలని ఆదేశించింది. ఇప్పటి వరకు చిత్రానికి సెన్సార్ ఇవ్వలేదని సోలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు చెప్పారు. అయితే.. వారం రోజుల్లో సినిమాను చూసి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. సినిమాలోని వివాదాలను పరిష్కరించి అభ్యంతరాలను స్వీకరించాలని సెన్సార్‌కు హైకోర్టు సూచించింది.
ఇదిలా ఉంటే.. రెండు కులాల మధ్య చిచ్చు రగిల్చే పరిస్థితులు ఉన్నందున వెంటనే సినిమా టైటిల్‌ను మార్చాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటికే టైటిల్‌ను మార్చామని కోర్టుకు రామ్ గోపాల్ వర్మ తెలిపాడు. సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆర్జీవీ కోరాడు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’కు బదులుగా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అని మారుస్తానని ఇప్పటికే ఆయన స్పష్టం చేశాడు. మొత్తానికి చూస్తే.. సినిమా రేపు రిలీజ్ కాదన్న మాట. మరి ఈ క్రమంలో ఆర్జీవీ ఎలా రియాక్ట్ అవుతారు..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఇప్పటికే పలువురు ఆర్జీవీ వీరాభిమానులు, ఔత్సాహికులు సినిమా టికెట్లు బుక్ చేసుకున్నారు. మరి వారి పరిస్థితేంటి..? అనేది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments