సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం!

  • IndiaGlitz, [Tuesday,October 29 2019]

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం నాడు సమ్మె, కార్మికుల డిమాండ్లపై వాదానలు విన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమ్మె విరమించాలని కార్మికులకు కోర్టు చెప్పదని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ప్రభుత్వ నివేదికపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. 4 డిమాండ్లు పరిష్కరించి.. రూ. 47 కోట్లు ఇస్తారా..? ఇవ్వరా అని హైకోర్టు ప్రశ్నించింది. బకాయిలపై ఎల్లుండిలోపు నివేదిక ఇవ్వాలని ఆర్టీసీ ఇన్‌చార్జ్ ఎండీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

చర్చకొచ్చిన అంశాలివీ..!

ఆర్టీసీ సమ్మె విచారణలో తెలుగు రాష్ట్రాల విభజన అంశం కూడా కోర్టులో ప్రస్తావనకు వచ్చింది. విభజన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా ఆస్తులు, అప్పులు ఇంకా ఎందుకు తీర్చలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ చెప్పినన్నీ బకాయిలు లేవు అని అడ్వకేట్ జనరల్‌ చెప్పుకొచ్చారు. విభజన తర్వాత ఆర్టీసీ ఆస్తుల పంపకాలు ఎందుకు జరగలేదని కోర్టు ప్రశ్నించగా.. విభజన అంశం అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి రాదని ఐజీ బదులిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వాటా రూ. 1,099 కోట్లని మీరే చెప్పారు కదా అని కోర్టు ప్రశ్నించగా.. అవును మీరు చెప్పినంతే బకాయిలు ఉన్నామని ప్రభుత్వం ఒప్పుకుంది. అయితే ఈ బకాయిల్లో 42 శాతం తెలంలగాణ, 58 శాతం ఏపీ చెల్లించాలని హైకోర్టుకు ఐజీ తెలిపారు.

నిజాలు దాస్తున్నారు..!?

అధికారులు తెలివిగా నిజాలను దాస్తున్నారు. రూ. 4,253 కోట్లు ఇస్తే బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదా..?. హైకోర్టుకు సమర్పిస్తున్న నివేదికల్లోనూ అధికారులు వాస్తవాలు దాస్తున్నారు’ ఆర్టీసీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకు గ్యారంటీ కింద రూ. 850 కోట్లు కట్టామని హైకోర్టుకు ఐజీ చెప్పగా.. ఇందుకు ఒక్కోరూపాయి బ్యాంక్‌కు కట్టినట్లు ఎక్కడా చెప్పలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవాలను అధికారులు కోర్టుల ముందు నిజాయితీ ఒప్పుకోవాలని ఆర్టీసీని కోర్టు ఒకింత హెచ్చరించింది.

47 కోట్లు ఇవ్వలేం..!

రూ. 47 కోట్లు వెంటనే ఇవ్వలేము. కొంత గడువు ఇస్తే ప్రయత్నిసామని ఐజీ.. కోర్టుకు వివరించారు. ఉప ఎన్నిక జరిగే చోట రూ. 100 కోట్ల వరాలు ప్రకటించడంపైనా ఈ సందర్భంగా కోర్టు స్పందించింది. ‘రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా..?. మొత్తం ఆర్టీసీ బస్సులు సంఖ్య ఎంత..? అసలు ఎన్ని బస్సులు తిరుగుతున్నాయో పూర్తి ఇవ్వాలి. పేద ప్రజలు ప్రయాణం చేయాలంటే.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు పడనప్పుడు స్కూల్స్‌కు సెలవులు ఎందుకు ఇచ్చారు..?’ అని ఆర్టీసీ, ప్రభుత్వంపై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే ఇందుకు స్పందించిన ఆర్టీసీ.. 75 శాతం బస్సులు తిరుగుతున్నాయని ఆర్టీసీ కోర్టుకు తెలిపిందని కోర్టుకు వివరించింది. అయితే ఇప్పటికీ మూడో వంతుకు కూడా బస్సులు నడట్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది.

సభకు గ్రీన్ సిగ్నల్

ఇదిలా ఉంటే ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన ‘సకల జనుల సమర భేరీ’ సభకు అనుమతిచ్చింది. సరూర్‌నగర్ స్టేడియంలో సభకు అనుమితివ్వాలని కోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. మొత్తానికి చూస్తే నేటి విచారణలో ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వానికి గట్టిగానే మెట్టికాయలు పడ్డాయని అర్థం చేసుకోవచ్చు. మరి వచ్చే శుక్రవారం నాడు కోర్టు ఏం తేల్చబోతోంది..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో..!

More News

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో కళ్యాణ్ రామ్ మరోసారి

డైన‌మిక్ హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ ఈ సంవత్సరం యాక్ష‌న్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ '118' తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో

మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారిన పూన‌మ్ ట్వీట్‌

న‌టి పూన‌మ్ కౌర్ మ‌రోసారి వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ప‌రోక్షంగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని, డైరక్ట‌ర్‌ని టార్గెట్ చేస్తూ కొన్ని మెసేజ్‌లు చేసింది.

'ఘంటసాల ది గ్రేట్' ట్రైలర్ ఆవిష్కరించిన చిత్ర

దక్షిణ భారత దేశమంతటా మారుమోగిన మహా గాయకుడు ఘంటసాల జీవితం తరువాతి తరాలకు కూడా తెలిసేలా చేసిన వెండితెర ప్రయత్నం 'ఘంటసాల ది గ్రేట్'.

హాలీవుడ్ స్టార్స్‌ను ప‌రుగులు పెట్టిస్తున్న కార్చిచ్చు

విల‌న్స్‌ను త‌మ ధైర్య సాహ‌సాల‌తో ప‌రుగులు పెట్టించే హాలీవుడ్ హీరోలు ఇప్పుడు భ‌యంతో ప‌రుగులు తీస్తున్నారు. ఇంత‌కు వారెందుకు ప‌రుగులు తీసున్నారో తెలుసా? దావాగ్ని కార‌ణంగా...

బ‌న్నీ చిత్రంలో విల‌న్‌గా న‌టించనున్న కోలీవుడ్ స్టార్‌..!

ప్ర‌స్తుతం `అల...వైకుంఠ‌పురుములో..` సినిమాను పూర్తి చేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మరో ప‌క్క త‌దుప‌రి సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌ట‌.