పొలిటికల్ జిమ్మిక్‌లొద్దు: కేసీఆర్ మిస్సింగ్ పిటిషన్‌పై హైకోర్టు

  • IndiaGlitz, [Friday,July 10 2020]

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలపాలంటూ ఇటీవల తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిపై వేసిన పిటిషన్ రాజకీయ దురేద్దశంతో వేసినట్టుగా అనిపిస్తోందని హైకోర్టు తెలిపింది. పొలిటికల్ జిమ్మిక్ చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేసింది. ఒకవేళ ముఖ్యమంత్రి కనిపించకుంటే హెబియస్ కార్పస్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

కాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పాలని హైకోర్టులో మాండమస్ పిటిషన్‌ను నవీన్ అలియాస్ తీన్‌మార్ మల్లన్న ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రగతి భవన్‌లో 30 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. అప్పటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్‌కి వెళ్లారని యూట్యూబ్‌లో ప్రచారం జరుగుతోందని పిటిషనర్ పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్యం ప్రజలకు తెలియాల్సిన అవసరముందన్నారు. సీఎంగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని.. రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆందోళన చెందుతున్నారన్నారు. కరోనాను కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. అనేక మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజలకు ధైర్యం చెప్పారని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. పీవీ శతజయంతి రోజు మీడియా ముందుకు వచ్చారని.. అప్పటి నుంచి కేసీఆర్ కనిపించడం లేదని ఆయన ఆరోగ్యం ఎలా ఉందో తెలపాలని పిటిషనర్ కోరారు.

More News

వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై ఎన్నో అనుమానాలు.. అసలేం జరిగింది!

కాన్పూర్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్, పూజాల రొమాంటిక్ స్టిల్‌తో ‘రాధేశ్యామ్’ ఫస్ట్‌లుక్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది.

రఘురామ కృష్ణరాజుపై వరుస కేసులు.. దారిలోకి తెచ్చే యత్నం!

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును దారిలోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో కాస్త తగ్గిన కరోనా కేసుల సంఖ్య

తెలంగాణలో గురువారానికి సంబంధించిన కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్

కాన్పూర్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. శుక్రవారం ఉదయం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వికాస్ దూబేను కాల్చి చంపేశారు.