పొలిటికల్ జిమ్మిక్‌లొద్దు: కేసీఆర్ మిస్సింగ్ పిటిషన్‌పై హైకోర్టు
Send us your feedback to audioarticles@vaarta.com
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలపాలంటూ ఇటీవల తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిపై వేసిన పిటిషన్ రాజకీయ దురేద్దశంతో వేసినట్టుగా అనిపిస్తోందని హైకోర్టు తెలిపింది. పొలిటికల్ జిమ్మిక్ చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేసింది. ఒకవేళ ముఖ్యమంత్రి కనిపించకుంటే హెబియస్ కార్పస్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
కాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పాలని హైకోర్టులో మాండమస్ పిటిషన్‌ను నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రగతి భవన్లో 30 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. అప్పటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్‌కి వెళ్లారని యూట్యూబ్‌లో ప్రచారం జరుగుతోందని పిటిషనర్ పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్యం ప్రజలకు తెలియాల్సిన అవసరముందన్నారు. సీఎంగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని.. రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆందోళన చెందుతున్నారన్నారు. కరోనాను కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. అనేక మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజలకు ధైర్యం చెప్పారని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. పీవీ శతజయంతి రోజు మీడియా ముందుకు వచ్చారని.. అప్పటి నుంచి కేసీఆర్ కనిపించడం లేదని ఆయన ఆరోగ్యం ఎలా ఉందో తెలపాలని పిటిషనర్ కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com