డైరెక్టర్‌కు భూ కేటాయింపులు.. సర్కార్‌కు కోర్టు నోటీసులు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ప్రభుత్వం సినీ రంగ అభివృద్ధికి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రభుత్వం బహిరంగంగానే ప్రకటించింది కూడా. తెలంగాణ దర్శకుడు ఎన్.శంకర్‌కు తెలంగాణ ప్రభుత్వం సినీ స్టూడియో కట్టడానికి ఓ ప్రాంతంలో కొంత భూమిని కేటాయించారు. ఇప్పుడు ఈ వ్యవహారం సర్కారుకి కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. తెలంగాణ ప్రభుత్వం డైరెక్టర్ ఎన్.శంకర్‌కు ఆయాచితంగా భూ కేటాయింపులు చేశారని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. భూమి ఎంతో ఖరీదైన ప్రాంతంలో తక్కువ ధరకే భూమిని సదరు డైరెక్టర్‌కి కేటాయించారంటూ సదరు పిటిషనర్ కోర్టులో కేసు వేశారు.
పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిందని వార్తలు వినపడుతున్నాయి. ఇలాంటి పిటిషన్స్ మరికొన్ని కూడా ఉన్నాయని వాటన్నింటినీ కలిపి హైకోర్టు విచారణకు స్వీకరించాలనుకుంటుందని టాక్. ముందుగా కోర్టు మున్సిపల్ శాఖకు నోటీసులు జారీ చేసిందట. మరి కోర్టుకు మున్సిపల్ శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మరి ఈ వ్యవహారంపై ప్రభుత్వం కూడా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ వార్తల్లో నిజా నిజాలేంటో తెలియాలంటే డైరెక్టర్ ఎన్.శంకర్ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com