ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. గవర్నర్ గెజిట్‌పై హైకోర్టు స్టే..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాజధానుల బిల్లుపై ఈ నెల 14 వరకూ హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం రాజధాని విభజన పిటిషన్లపై నేడు విచారణ నిర్వహించింది. పిటిషనర్ల తరుఫున వాదిస్తున్న శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ వాదిస్తున్నారు. బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని వారు కోర్టుకు వివరించారు. దీంతో ఏపీ గవర్నర్ గెజిట్‌పై హైకోర్టు స్టే విధించింది. ఆగస్ట్ 14 వరకూ ఈ స్టే వర్తిస్తుందని ధర్మాసనం వెల్లడించింది. రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి ప్రభుత్వ తరుఫు న్యాయవాది పది రోజుల గడువు కోరారు. తదుపరి విచారణను హైకోర్టు ఆగస్టు 14కు వాయిదా వేసింది.
కాగా.. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఇక అమరావతికి గుడ్‌బై చెప్పి విశాఖ నుంచి పాలన సాగించాలని ఏపీ ప్రభుత్వం భావించింది. దీనికంటే ముందు ఏపీని నాలుగు జోన్లుగా విభజించాలని.. ఈ విభజన పూర్తయిన అనంతరమే రాజధాని పనులు చూడాలని ఏపీ ప్రభుత్వం భావించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై రాజధానికి భూములిచ్చిన అమరావతి ప్రాంత రైతుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ప్రభుత్వం తమ పోరాటాన్ని పట్టించుకోదని భావించిన రైతులు ఇక న్యాయపోరాటానికి ఉపక్రమించారు. ఈ నేపథ్యంలోనే పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout