డిగ్రీ, పీజీ పరీక్షల రద్దుపై హైకోర్టులో విచారణ

  • IndiaGlitz, [Thursday,July 09 2020]

డిగ్రీ, పీజీ పరీక్షల రద్దు చేయాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని.. రద్దు చేయడం కుదరని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. పరీక్షల తేదీలను సైతం రెండు, మూడు వారాల అనంతరం ఖరారు చేస్తామని ఏజీ తెలిపారు.

కాగా ఇంటర్నల్ మార్కుల ద్వారా గ్రేడింగ్ ఇవ్వాలని పిటిషనర్ తరుఫు న్యాయవాది దామోదర్ రెడ్డి వాదించారు. యూజీసీ మార్గదర్శకాలు కేవలం సూచనలు మాత్రమేనని దామోదర్ రెడ్డి కోర్టుకు వెల్లడించారు. ఇప్పటికే ఏడెనిమిది రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేశారని తెలిపారు. అయితే మూడు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

More News

తెలంగాణలో దారుణం.. హాస్పిటల్ బయటే కుప్పకూలి వ్యక్తి మృతి

కరోనా కారణంగా తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి.

హైద‌రాబాద్‌కి షిఫ్ట్ అవుతున్న ఫైట‌ర్‌

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన ప్రబోధానంద

త్రైత సిద్ధాంతకర్త ప్రబోధానంద నేడు అనారోగ్యంతో తాడిపత్రిలో మృతి చెందారు.

తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన సుద్దాల అశోక్ తేజ

తన ఆరోగ్యంపై వదంతులు వస్తున్నాయని.. మళ్లీ తన ఆరోగ్యం క్షీణించిందని వార్తల్లో వచ్చినట్టు తెలిసిందని..

ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ ఒక్కరోజే..

ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ నేడు కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది.