'లక్ష్మిస్ ఎన్టీఆర్' రిలీజ్‌కు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మిస్ ఎన్టీఆర్'.. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెరకెక్కించిన 'లక్ష్మీస్ వీర గ్రంథం' సినిమాల విడుదలను ఆపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే వాదనలు విన్న కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో మేము కలగజేసుకోలేమని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
రెండు సినిమాల్లో సన్నివేశాలు ఏవైనా అభ్యంతరకరంగా వాటి పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. తెలంగాణాలో సినిమా విడుదల చేసిన ఎలాంటి ఇబ్బంది లేదని.. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలగకుండా మా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటారని తెలంగాణా అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించుకున్నారు. దీంతో సినిమా విడుదలకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కాగా.. పైన చెప్పిన రెండు సినిమాలను ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయొద్దని.. ఎన్నికల సమయంలో విడుదల చేస్తే ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ తెలంగాణ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది. దీనిపై నిశితంగా వాదనలు విన్న కోర్టు కొట్టేసింది. దీంతో అటు ఆర్జీవీ మూవీ చిత్రబృందం.. ఇటు కేతిరెడ్డి చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్స్ చేశారు.
ఆర్జీవీ ట్వీట్..
"లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను ఆపాలని వేసిన పిటిషన్‌ను వాదనలు విన్న టీఎస్ హైకోర్టు కొట్టేసింది. కాగా విడుదలను ఆపాలని ’..ఎన్నికల సమయంలో విడుదల చేస్తే ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పిటిషన్ దాఖలు ..పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు" ఆర్జీవీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments