Rajadhani Files:‘రాజధాని ఫైల్స్‌’ సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

  • IndiaGlitz, [Friday,February 16 2024]

‘రాజధాని ఫైల్స్‌’(Rajadhani Files) సినిమా విడుదలకు ఆటంకం తొలగిపోయింది. మూవీ రిలీజ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈరోజు విచారణ సందర్భంగా సెన్సార్‌ బోర్డు రివైజింగ్‌ కమిటీ ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించిన న్యాయస్థానం స్టే కొనసాగించేందుకు నిరాకరించింది. నిబంధనల మేరకు అన్ని సర్టిఫికెట్లు జారీ చేశారని స్పష్టం చేసింది. దీంతో నిరభ్యంతరంగా సినిమాను విడుదల చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో సినిమాను థియేటర్లలో ప్రదర్శించేందుకు నిర్వహకులు సన్నాహాలు చేపట్టారు.

కాగా సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఈ సినిమా తీశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల వేళ వైసీపీని చులకన చేయాలనే ఉద్దేశంతోనే సినిమాను తీశారని ఆయన ఆరోపించారు. ఈనెల 5వ తేదీన ట్రైలర్‌ విడుదల చేశారని అందులో ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపించారని వివరించారు. కోర్టు పరిధిలో ఉన్న మూడు రాజధానుల అంశంపై సినిమా తీయడం ఎంత మాత్రం సరికాదన్నారు. అయినా తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా 'రాజధాని ఫైల్స్‌' చిత్ర ప్రదర్శనకు సెన్సార్ అధికారులు ధ్రువీకరణ పత్రం జారీ చేశారని వాదించారు.

అయితే నిర్మాతల తరపు న్యాయవాది ఉన్నం మురళీధరరావు ఈ వాదనలను ఖండించారు. రివిజన్ కమిటీ సూచనల మేరకు ఆయా సన్నివేశాలను తొలగించామని.. ఆ తర్వాతే తమకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందని తెలిపారు. గతేడాది డిసెంబర్ నెలలో తమకు సెన్సార్ సర్టిఫికెట్ వస్తే.. వైసీపీ నేతలు ఇప్పుడు కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం శుక్రవారం వరకు సినిమాను నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో పలు చోట్ల అధికారులు సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. సినిమాకు సంబధించి పూర్తి రికార్డులను అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో నిర్వాహకులు వాటిని సమర్పించారు. ఆ రికార్డులను పరిశీలించిన న్యాయస్థానం మూవీ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మూవీ విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోయాయి.

ఇక ఈ మూవీలో సీనియర్ నటులు వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ నటించారు. ఇక ప్రముఖ సంగీత దర్శకడు మణిశర్మ సంగీతం అందించడం విశేషం. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా, సుద్ధాల అశోక్ తేజ గేయ రచయితగా పనిచేశారు.

More News

Pawan:కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం అలాగే కూలిపోతుంది: పవన్

కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం చివరికి కూలిపోతుంది అని జనసేనాని తెలిపారు. విజయవాడలో "విధ్వంసం"

ఎలక్టోరల్ బాండ్లతో రూ.16వేల కోట్ల విరాళాలు.. బీజేపీకి భారీ ఎదురుదెబ్బ..

రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు అందించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ బాండ్లపై తీవ్ర చర్చ మొదలైంది.

YS Jagan: కాబోయే లీడర్లు వాలంటీర్లే.. యుద్ధానికి సిద్ధం కావాలని సీఎం జగన్ పిలుపు..

రాబోయే రోజుల్లో కాబోయే లీడర్లు వాలంటీర్లే అని ఏపీ సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలోని 2.60 లక్షల మంది వాలంటీర్లే తన సైన్యం అని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం

Komatireddy: హరీష్‌రావును సీఎంగా చేస్తాం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్‌హాట్‌గా జరుగుతున్న సంగతి తెలిసిందే. కృష్ణా నది ప్రాజెక్టులపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.

Rajadhani Files: ఏపీలో 'రాజధాని ఫైల్స్' సినిమా నిలిపివేసిన అధికారులు.. ఎందుకంటే..?

రాజధాని ఫైల్స్‌(Rajdhani Files) సినిమా ప్రదర్శనను ఏపీలో పలు చోట్ల అధికారులు నిలిపివేశారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.