కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు డెడ్‌లైన్..

  • IndiaGlitz, [Wednesday,May 05 2021]

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు హాజరైన డీజీపీ మహేందర్ రెడ్డి, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ హాజరయ్యారు. విచారణలో భాగంగా హైకోర్టు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో టెస్టుల సంఖ్య తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెబుతారంటూ ఫైర్ అయింది. టెస్టులు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించింది. రాష్ట్రంలో కావాల్సిన టెస్టులు చేస్తున్నామని కోర్టుకు శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఒక్కరోజు కూడా లక్ష టెస్టులు దాటలేదెందుకని హైకోర్టు ప్రశ్నించింది. నైట్ కర్ఫ్యూ పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకున్నారంటూ హైకోర్టు మండిపడింది.

Also Read: ఆరోగ్యశాఖ విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం!

అసలు తెలంగాణలో పరిస్థితులు ఇలా ఉంటే.. లాక్‌డౌన్ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ డేటా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఆక్సిజన్ ఎంత డిమాండ్ ఉందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును హైకోర్టు ప్రశ్నించింది. 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ డిమాండ్ ఉందని శ్రీనివాసరావు కోర్టుకు తెలిపారు. కేంద్రం 430 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇచ్చిందని కూడా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ తీసుకొచ్చామని శ్రీనివాస్‌రావు కోర్టుకు తెలిపారు. ఇంకా తమిళనాడు నుంచి రావాల్సిన 55 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాలేదని శ్రీనివాసరావు వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం కోరిన 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను అందించాలని కేంద్రానికి తెలంగాణ హైకోర్టు అదేశాలు జారీ చేసింది. రెమిడిసివర్ ఇంజక్షన్, టోసిలి జముద్ ఇంజక్షన్‌ల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ప్రతిరోజు జిల్లాల వారీగా కోవిడ్ టెస్ట్‌ల రిపోర్టులను విడుదల చేయాలని హైకోర్టు తెలిపింది. కరోనాకు సంబంధించి ప్రతి రోజూ మీడియా బులిటెన్ సైతం విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మైక్రో కంటైన్మెంట్ జోన్‌లలో టెస్టుల సంఖ్య పెంచాలని ఆదేశించింది. హితమ్ యాప్‌లో కోవిడ్ వివరాల కోసం ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ పెట్టిందని శ్రీనివాసరావు కోర్టుకు వెల్లడించారు. వీకెండ్ లాక్‌డౌన్‌పై ఈ నెల 8 కంటే ముందే నిర్ణయం తీసుకోవాలని టీఎస్ హైకోర్టు ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది.

More News

ఎవరెప్పుడు పోతారో తెలియట్లేదు: జగపతిబాబు భావోద్వేగం

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశంలో విలయ తాండవం చేస్తోంది. సెకండ్ వేవ్‌లో లక్షల్లో ప్రజలు కరోనా బారిన పడుతుండగా..

ఆరోగ్యశాఖ విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం!

తెలంగాణలో రాజకీయపరంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. మినీ మునిసిపల్ ఎన్నికలు ముగిశాయో లేదో..

హైదరాబాద్ జూలోని 8 సింహాలకూ కరోనా.. అసలెలా సోకిందంటే..

కరోనా సెకండ్ వేవ్ ఊహించని రీతిలో ప్రళయం సృష్టిస్తోంది. మనుషులకే కాదు.. జంతువులకు సైతం వ్యాపించి షాకిస్తోంది.

మమతా మోహన్‌దాస్ బోల్డ్ ఫోటోషూట్.. నెటిజన్లు ఫిదా..

ఫొటోషూట్‌లు చేసే కొద్దిమంది నటీమణులలో మోలీవుడ్ ముద్దుగుమ్మ మమతా మోహన్‌దాస్ ఒకరు.

నేటి నుంచి ఏపీలో కర్ఫ్యూ.. కఠిన నిబంధనల అమలు

కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. నేటి(బుధవారం) నుంచి కట్టుదిట్టమైన నిబంధనలతో కర్ఫ్యూ అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది.