తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలు.. హైకోర్టు ఫైర్..
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. నూతన సంవత్సర వేడుకలను బ్యాన్ చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు కొత్త కరోనా వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై ఫైర్ అయింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు న్యూ ఇయర్‌పై బ్యాన్ విధించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలకూ ఉపక్రమించలేదు. పైగా బార్లకు అర్ధరాత్రి వరకూ అనుమతినిచ్చింది. ఈ అంశాలన్నింటినీ సుమోటోగా తీసుకుని హైకోర్టు విచారణ నిర్వహించింది.
న్యూ ఇయర్ వేడుకలను ఎందుకు బ్యాన్ చేయలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మీడియా కథనాలను సుమోటోగా తీసుకుని హైకోర్టు విచారించింది. ఓ వైపు కొత్త వైరస్ ప్రమాదకరమని హెల్త్ డైరెక్టర్ చెబుతుంటే.. వేడుకలకు ఎలా అనుమతి ఇచ్చారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచ్చలవిడిగా బార్లు తెరిచి ఏం చేయాలనుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. రాజస్థాన్, మహారాష్ట్రలో ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలను బ్యాన్ చేశారని హైకోర్టు వెల్లడించింది.
ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించింది. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్లను మూసివేస్తే సరిపోదని.. ఈ రోజు రాత్రి 144 సెక్షన్ విధించే అవకాశాలను కూడా పరిశీలించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఈ రోజు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. భౌతిక దూరం, మాస్క్‌లు తప్పకుండా వినియోగించాలని హైకోర్టు సూచించింది. కరోనాను దృష్టిలో పెట్టుకుని వేడుకలు జరపొద్దని ప్రజలకు సూచించినట్టు కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. జనవరి 7న దీనిపై పూర్తి నివేదికను సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout