ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్టుదలతో ఉంది. మరోవైపు జగన్ సర్కార్.. ఎన్నికలను నిర్వహించేందుకు ఏమాత్రం సుముఖంగా లేదు. ఈ వ్యవహారం ధర్మాసనాల వరకూ వెళ్లింది. కాగా.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. దీనిపై కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికల నిర్వహణ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వదిలి వేయాలని.. అదే నిర్ణయం తీసుకుంటుందని.. ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కరోనా వ్యాక్సిన్, స్థానిక ఎన్నికలు రెండూ ప్రజలకు సంబంధించినవేనని.. దీనిపై కూర్చోని మాట్లాడుకుంటే బాగుంటుంది హైకోర్టు తెలిపింది. అలా లేని పక్షంలో ముగ్గురు అధికారులను ఎస్ఈసీ వద్దకు పంపాలని సూచించింది. కమిషన్‌తో అధికారుల భేటీపై కమిషనర్ ఒక వేదికను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అధికారుల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో చర్చించిన అంశాలను తెలపాలని.. దీనికి సంబంధించి ఈ నెల 29న తదుపరి నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం వెల్లడించింది.
కాగా.. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో కరోనా పరిస్థితులతో పాటు వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో అధికారుల బృందం చర్చించనుంది. కరోనా వ్యాక్సిన్ అందించేందుకు గాను.. కేంద్రం షెడ్యూల్ విడుదల చేస్తే దానికి కట్టుబడి ఉంటామని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. కాగా.. ఇప్పటికే ఎన్నికల విషయంపై పలుమార్లు వివాదం జరిగింది. మరి హైకోర్టు తాజా ఆదేశాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments