ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..

  • IndiaGlitz, [Wednesday,December 23 2020]

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్టుదలతో ఉంది. మరోవైపు జగన్ సర్కార్.. ఎన్నికలను నిర్వహించేందుకు ఏమాత్రం సుముఖంగా లేదు. ఈ వ్యవహారం ధర్మాసనాల వరకూ వెళ్లింది. కాగా.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. దీనిపై కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికల నిర్వహణ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వదిలి వేయాలని.. అదే నిర్ణయం తీసుకుంటుందని.. ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కరోనా వ్యాక్సిన్, స్థానిక ఎన్నికలు రెండూ ప్రజలకు సంబంధించినవేనని.. దీనిపై కూర్చోని మాట్లాడుకుంటే బాగుంటుంది హైకోర్టు తెలిపింది. అలా లేని పక్షంలో ముగ్గురు అధికారులను ఎస్ఈసీ వద్దకు పంపాలని సూచించింది. కమిషన్‌తో అధికారుల భేటీపై కమిషనర్ ఒక వేదికను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అధికారుల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో చర్చించిన అంశాలను తెలపాలని.. దీనికి సంబంధించి ఈ నెల 29న తదుపరి నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం వెల్లడించింది.

కాగా.. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో కరోనా పరిస్థితులతో పాటు వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో అధికారుల బృందం చర్చించనుంది. కరోనా వ్యాక్సిన్ అందించేందుకు గాను.. కేంద్రం షెడ్యూల్ విడుదల చేస్తే దానికి కట్టుబడి ఉంటామని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. కాగా.. ఇప్పటికే ఎన్నికల విషయంపై పలుమార్లు వివాదం జరిగింది. మరి హైకోర్టు తాజా ఆదేశాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

More News

తల్లి గర్భంలో మైక్రో ప్లాస్టిక్.. వైద్య చరిత్రలో ఇదే తొలిసారి..

ప్లాస్టిక్ గురించి ఎన్ని చెప్పినా మనుషుల మెదడులోకి మాత్రం ఎక్కడం లేదు. పర్యావరణానికి తీవ్ర విఘాతం సృష్టిస్తున్న ఈ ప్లాస్టిక్ ప్రస్తుతం మానవ మనుగడకే ప్రశ్నార్థకంగా మారిపోయింది.

సూపర్ హిట్ రీమేక్‌లో హీరోగా సునీల్...

హాస్యనటుడిగా కెరీర్‌ను ప్రారంభించినప్పటికీ.. హీరోగా మారి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి.. అనంతరం ఆ పాత్ర..

మెగాస్టార్‌ను క‌లిసి మంచు హీరో.. కార‌ణం మ‌ళ్లీ చెబుతాడ‌ట‌... !

మెగాస్టార్ చిరంజీవికి, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబుకి ఒకానొక సంద‌ర్భంలో మ‌న‌స్ప‌ర్ధ‌లు బాగానే ఉండేవి.

కొత్త రకం కరోనా వేరియంట్ విషయమై గుడ్ న్యూస్!

కొత్త రకం కరోనా వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీంతో పలు దేశాలు యూకేకు విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి.

జిమ్‌కి వెళుతూ కారులో ఆ సినిమా పాటలు వింటూ ఉండేవాడిని: రామ్ చరణ్

లాక్‌డౌన్ ప్రారంభమైన తరువాత పరిస్థితులు మారిపోయాయి. ఓటీటీ కంటెంట్‌కు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది.