ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్ అంటే ఎలా?: హైకోర్టు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో కరోనా పరిస్థితులపై నేటి మధ్యాహ్నం తిరిగి విచారణ ప్రారంభమైంది. ఈ విచారణలో రేపటి నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్ విధించనున్నట్టు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టుకు వివరించారు. ఇవాళ ఉదయం 10 గంటల వరకూ మీరు కనీసం వీకెండ్ లాక్ డౌన్ కూడా పెట్టాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. సడెన్‌గా రేపటి నుంచి లాక్ డౌన్ అంటే ఇతర రాష్ట్రాల ప్రజలు ఇంత తక్కువ టైంలో ఎలా వారి ప్రాంతాలకు వెళ్లిపోతారని హైకోర్టు ప్రశ్నించింది. పోయిన ఏడాది ఇలాగే సడెన్‌గా లాక్‌డౌన్ విధించిన కారణంగా వలస కార్మికులు ఇబ్బందులు పడ్డారని.. ఈ సారి ఇబ్బంది పడకుండా చూడాలని పిటిషనర్లు కోర్టును కోరారు.
వలస కార్మికుల కోసం ఏం చేస్తున్నారు?
రోజువారీ కూలి చేస్తూ బతికే వాళ్లతో పాటు వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. 50 శాతం వలస కార్మికులు వాళ్ళ వాళ్ళ సొంతూళ్లకు వెళ్లారని ఏజీ కోర్టుకు వెల్లడించారు. లాక్ డౌన్ వల్ల సాయంత్రపు వేళల్లో ఏమైనా రిలాక్సేషన్ ఉందా.. అని హైకోర్టు ప్రశ్నించింది. అలాంటిదేమీ లేదని ఏజీ తెలిపారు. లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌పై పూర్తి వివరాలు కోసం అడ్వకేట్ జనరల్ మూడు రోజుల సమయం కోరారు. అప్పటి వరకూ జనాలు ప్రాణాలు కోల్పోవాలా అని హైకోర్టు ప్రశ్నించింది. మందుల రేట్లు, ప్రైవేట్ హాస్పిటల్ అధిక బిల్లులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. ఇంత క్లిష్ట సమయంలో హాస్పిటల్‌పై చర్యలు తీసుకోమని తాము ఎలా అదేశిస్తామని హైకోర్టు ప్రశ్నించింది.
అంబులెన్స్ నిలిపివేతకు ఆదేశాలెక్కడివి?
ఆర్టికల్ 14,19 1(d) ప్రకారం అంతర్ రాష్ట్ర సరిహద్దుల నుండి అంబులెన్స్‌లను నిలిపివేసి ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. లాక్ డౌన్ సందర్భంగా ఎమర్జెన్సీ పాస్‌లను ఇస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. బార్డర్ వద్ద అంబులెన్స్ నిలిపివేత అదేశాలు ఏమైనా ఉన్నాయా అని హై కోర్టు ప్రశ్నించింది. లిఖితపూర్వ అదేశాలేమీ లేవని ఏజీ కోర్టుకు తెలిపారు. మరి ఓరల్ ఆర్డర్స్ ఉన్నాయా? అని హైకోర్టు ప్రశ్నించగా.. సీఎస్‌ను అడిగి చెబుతామని ఏజీ వెల్లడించారు. కాగా.. సరిహద్దులో అంబులెన్స్‌లను నిలిపి వేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. రిలాక్సేషన్ సమయంలో ఉదయం 6 నుంచి 10 వరకూ జన సమూహంపై వీడియో గ్రఫి చేయాలనీ ముగ్గురు పోలీస్ కమిషనర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మందుల ధరలు నియంత్రణ, కోవిడ్ చికిత్స, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పై తదుపరి విచారణకు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 17కి వాయిదా వేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments