తెలంగాణలో ప్రైవేటు అస్పత్రుల దోపిడీపై హైకోర్టు సీరియస్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో నేడు మరోసారి సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా కేసీఆర్ సర్కార్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు పలు కీలక ఆదేశాలు, సూచనలు చేసింది. ఇతర రాష్ట్రాల్లో లాగా తెలంగాణలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎందుకు నిర్వహించడం లేదని కోర్టు ప్రశ్నించింది. వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ 15వ స్థానంలో ఉందని పిటిషనర్స్ కోర్టుకు తెలిపారు. బెడ్స్ సామర్థ్యంపై వెబ్సైట్లో ఒకలా.. గ్రౌండ్ లెవల్లో మరోలా ఉందేం..? అని హైకోర్టు మండిపడింది.
Also Read: కర్ఫ్యూ, బ్లాక్ ఫంగస్ చికిత్స విషయంలో జగన్ కీలక నిర్ణయం
మరోవైపు.. ప్రైవేటు అస్పత్రుల దోపిడీపై కూడా హైకోర్టు సీరియస్ అయ్యింది. కరోనా మొదటి దశలో ప్రైవేట్ హాస్పిటల్ ఛార్జీలపై ముగ్గురు ఐఏఎస్‌లతో కూడిన టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు.. కానీ రెండో దశలో కరోనా తీవ్రంగా ఉన్నా చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్ ఛార్జీలపై టాస్క్ ఫోర్స్ కమిటీ చర్యలు తెసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో్ సిటిస్కాన్, ఇతర టెస్టులకు ధరలు నిర్ణయించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఇచ్చిన జీవో ఇప్పుడు సరిపోదని టీఎస్ హైకోర్టు అభిప్రాయపడింది. కొత్తగా ధరలపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అలాగే ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకలపై వెబ్‌సైట్‌లోని వివరాలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని హైకోర్టు తెలిపింది.
మాస్కులు ధరించనందుకు రూ.31 కోట్ల జరిమానా.. కరోనా నిబంధనల అమలుపై డీజీపీ మహేందర్‌రెడ్డి కోర్టుకు నివేదిక సమర్పించారు. ఔషధాల బ్లాక్ మార్కెట్ పై 98 కేసులు నమోదు చేశామని.. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద 57 సహాయ కేంద్రాల ఏర్పాటు చేశామని కోర్టుకు డీజీపీ తెలిపారు. లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూ పకడ్బందీ అమలుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ నెల 1 నుంచి 14 వరకు 4,31,823 కేసులు నమోదు చేశామన్నారు. మాస్కులు ధరించనందుకు 3,39,412 కేసులు, రూ.31కోట్ల జరిమానా విధించినట్టు డీజీపీ వెల్లడించారు. భౌతిక దూరం పాటించనందుకు 22,560 కేసులు.. కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనపై 26,082 కేసులు పెట్టినట్టు కోర్టుకు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. కాగా.. లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసుల పనితీరు అభినందనీయమని హైకోర్టు కొనియాడింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments