రఘురామ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్..

  • IndiaGlitz, [Wednesday,May 19 2021]

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహరంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను రద్దు చేయాలని.. ఏపీ ప్రభుత్వం వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. మెజిస్ట్రేట్ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని.. ఏపీ ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం నిలదీసింది. మధ్యాహ్నం 12 గంటలకు మెడికల్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించినా.. సాయంత్రం 6 గంటల వరకు ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు సీరియస్ అయ్యింది.

రాత్రి 11 గంటలకు ఆర్డర్ కాపీ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వంపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కింద నోటీసులివ్వాలని జ్యుడిషియల్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే కోర్టులు స్పందిస్తాయని హైకోర్టు పేర్కొంది. సీఐడీ అడిషనల్ డీజీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు నోటీసులివ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

వైద్య పరీక్షల నివేదికను సుప్రీంకోర్టుకు..

కాగా.. రఘురామకు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో రెండో రోజు వైద్యపరీక్షలు నిర్వహించారు. వీఐపీ స్పెషల్ రూములో ఆర్మీ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. రఘురామకు అయిన గాయాలపై నిన్న (మంగళవారం) నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికను తెలంగాణ హైకోర్టు సీల్డు కవర్‌లో సుప్రీం కోర్టుకు పంపించింది. రక్తం, చర్మ పరీక్షలు నిర్వహించినట్లు ఆర్మీ వైద్యులు నివేదికలో పేర్కొన్నారు. సీల్డ్ కవర్‌లోని నివేదిక, వీడియోను శుక్రవారం సుప్రీం కోర్టు పరిశీలించనున్నట్లు సమాచారం. మళ్లీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు రఘురామ ఆర్మీ ఆస్పత్రిలో జ్యడిషియల్ కస్టడీలో ఉంటారు. కొవిడ్ నిబంధనల ప్రకారమే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించామని ఆర్మీ వైద్యులు తెలిపారు. రెండో రోజు పరీక్షల్లో భాగంగా.. రఘురామకు ఆర్మీ వైద్యులు బీపీ, షుగర్, బ్లడ్ టెస్ట్‌లు పూర్తి చేశారు.

More News

లేడీ కానిస్టేబుల్ హనీ ట్రాప్.. నాలుగో భర్త పోలీసులకు ఫిర్యాదు

వృత్తి పరంగా ఆమె ఒక కానిస్టేబుల్.. ప్రవృత్తి డబ్బున్న వారిని పెళ్లి పేరుతో మోసం చేయడం.. ఒకరు కాదు..

పీపీఈ కిట్ లేకుండా గాంధీ ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. పీపీఈ కిట్ వేసుకోకుండా కేవలం మాస్కు పెట్టుకుని వెళ్లి గాంధీలోని కరోనా రోగులను పరామర్శించారు.

వ్యాక్సిన్‌కు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో కొవిడ్ కేసుల సంఖ్య భారీగానే ఉంది. అయితే వ్యాక్సిన్ కొరత కూడా రాష్ట్రాన్ని వేధిస్తోంది. 18-45 ఏళ్ల మధ్య వయసువారికి వ్యాక్సిన్ అందిస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ టీకా అభివృద్ధికి హైదరాబాదీ కంపెనీ సాయం

కరోనా మహమ్మారిని నిర్మూలించడంలో భాగంగా వ్యాక్సిన్ల తయారీకి తెలంగాణ క్రమంగా గ్లోబల్ హబ్‌గా మారబోతున్నట్టు కనిపిస్తోంది.

'నేనే అందరినీ చంపుతా'.. వామ్మో.. సమంత యాక్షన్ చూశారా!

స్టార్ హీరోయిన్ సమంత నటించిన తొలి వెబ్ సిరీస్ ' ది ఫ్యామిలీ మ్యాన్ 2'. జూన్ 4న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రాబోతోంది.