Chandrababu:చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా చేసిన హైకోర్టు

  • IndiaGlitz, [Friday,November 10 2023]

స్కిల్ డెవల్‌ప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఇవాళ(శుక్రవారం) ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం ఈ నెల 15కు విచారణ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. విచారణకు అదనపు ఏజీ హాజరు కాలేకపోతున్నట్లు.. కొంత సమయం కావాలని సీఐడీ ప్రత్యేక పీపీ వివేకానంద కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు విచారణ వాయిదా వేసింది. తొలుత విచారణను ఈ నెల 22కు వాయిదా వేయాలని హైకోర్టును ప్రత్యేక పీపీ అభ్యర్థించగా న్యాయస్థానం తోసిపుచ్చింది. కాగా ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ విడుదలైన సంగతి తెలిసిందే.

ఇక స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వాయిదా వేసింది. పాత ఆర్డర్ ప్రకారం దీపావళి సెలవుల అనంతరం తీర్పు ఇస్తామని పేర్కొంది. అటు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. అంతవరకూ చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశించింది. ఫైబర్ నెట్ కేసులో అక్టోబర్ 9న చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిలు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

నవంబర్‌ 30వ తేదీలోగా క్వాష్ పిటిషన్‌పై తుది ఉత్తర్వులు వెలువడితే ఫైబర్‌ గ్రిడ్‌ కేసు విషయంలోనూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఫైబర్‌గ్రిడ్ కేసులో మిగిలిన నిందితులకు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు అయినందున తనకు కూడా బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు కోరుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని సీఐడీ అభియోగాలు మోపింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

More News

Raghavendra Rao:దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తెలంగాణ హైకోర్టు నోటీసులు

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసింది.

BJP:14 మందితో బీజేపీ నాలుగో(తుది) జాబితా విడుదల

తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్లకు ఇవాళ ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు క్యూ కడుతున్నారు.

Congress:కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపుతున్న తుది జాబితా లిస్ట్

తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్లకు ఇవాళ ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు క్యూ కడుతున్నారు.

Bigg Boss Telugu 7 : ప్రిన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శోభ తల్లి .. యావర్ బ్రదర్ రాకతో హౌస్‌లో అన్నదమ్ముల అనుబంధం

బిగ్‌బాస్ 7 తెలుగులో ఎమోషన్ సీన్స్ పండుతున్నాయి. ఈ వారం మొత్తం ఎలాంటి గొడవలు, టాస్క్‌లు, ఛాలెంజ్‌లు లేకుండా ఫ్యామిలీ వీక్‌లా మారిపోయింది.

CM KCR:సీఎం కేసీఆర్ ఆస్తులు ఎంతో తెలుసా..?

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే.