అయోధ్యలో హై అలెర్ట్.. ఉగ్రదాడికి కుట్ర!

ఆయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఆగస్ట్ 5న భూమిపూజ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తొలి ఇటుకను ప్రధాని మోదీ అందించనున్నారు. దీనికోసం ఇటుకను ఇప్పటికే సిద్ధం చేశారు. 22.600 గ్రాముల వెండితో ఈ ఇటుకను తయారు చేశారు. 5వ తేదీన 12:15 గంటలకు ముహూర్తం కూడా ఖరారైంది. మరోవైపు ఈ వేడుకను భగ్నం చేసి.. వేడుకలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్ర పన్నుతున్నట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి.

ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అయోధ్యలో హైఅలెర్ట్ ప్రకటించాయి. ఇంటింటా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయోధ్య ప్రాంతమంతా డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. కాగా.. జమ్మూకశ్మీర్‌కి స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన రోజు.. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేయనున్న రోజు ఒకటే కావడం గమనార్హం.

More News

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'  రొమాంటిక్ పోస్టర్ విడుదల

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న చిత్రం "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్".

వెంటిలేటర్‌పై ఐదేళ్ల పాప.. యూనిట్ రక్తం.. ప్రపంచమంతా గాలించారు.. చివరకు..

వెంటిలేటర్‌పై ఐదేళ్ల చిన్నారి.. ఎలాగైనా బతికించాలనే తాపత్రయం.. కనీసం ఒక్క యూనిట్ బ్లడ్ దొరికినా చాలు..

తెలంగాణలో నేడు కొత్తగా 1764 కేసులు నమోదు..

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్‌ను బుధవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్‌2....అధీరాగా బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ లుక్ విడుద‌ల‌

ఈ మ‌ధ్య కాలంలో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేపిన అంశం.. అధీరా లుక్‌. ఇంత‌కూ అధీర ఎవ‌రు? క‌్రూర‌మైన వ్య‌క్తి.

దేశ వ్యాప్తంగా ఆగస్ట్‌లో తెరుచుకోనున్న థియేటర్లు!

లాక్‌డౌన్ సమయంలో మూతపడ్డ సినిమా హాళ్లు ఇప్పటికీ ఓపెన్ కాలేదు. అయితే ఇప్పుడిప్పుడే పలు దేశాల్లో కొన్ని జాగ్రత్తల నడుమ హాళ్లు తెరుచుకుంటున్నాయి.