Hi Nanna:లవ్, ఎమోషన్, సెంటిమెంట్.. 'హాయ్ నాన్న' ట్రైలర్ వచ్చేసింది..
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'హాయ్ నాన్న' చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌లో నాని, తన కూతురు జీవితంలోకి హీరోయిన్ మృణాల్ వచ్చినట్టు చూపించారు. ఇక తన కూతురుకు అమ్మ గురించి తన గతం చెప్పడం.. ఇందులో శృతిహాసన్‌ను చూపిస్తూ సస్పెన్ క్రియేట్ చేశారు. అసలు నాని.. శృతిహాసన్‌ను పెళ్లి చేసుకున్నాడా.. చేసుకుంటే ఎందుకు విడిపోయారు.. మధ్యలో నాని జీవితంలోకి మృణాల్ వచ్చాక ఏమైందనే అంశాలతో ట్రైలర్ ఆసక్తిగా కట్ చేశారు. దీంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది.
నాని 30వ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకి కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చెరుకూరి వెంకట మోహన్, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ‘ఖుషి’ సినిమాకు హిట్ ఆల్బం అందించిన హేషామ్ అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకు కూడా సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన మూవీ సాంగ్స్ చార్ట్ బాస్టర్స్‌గా నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రాజకీయ నాయకుడిగా నాని చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రెస్ మీట్లను అనుకరిస్తూ చేసిన వీడియోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ సినిమా గురించి జనం మాట్లాడేలా చేయడంలో నాని సూపర్ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందంటున్నాడు ఈ నేచురల్ స్టార్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments