Hi Nanna Trailer: 'హాయ్ నాన్న' ట్రైలర్ విడుదలకు ముహుర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?

  • IndiaGlitz, [Tuesday,November 21 2023]

నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన తాజా సినిమా 'హాయ్ నాన్న'. డిసెంబర్ 7న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో చేస్తున్నాడు నాని. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సీజన్ కావడంతో రాజకీయ నాయకుడిలా మారి తన సినిమాపై హైప్ తీసుకొస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నామో ప్రకటించాడు. అలాగే ఈ మూవీ రన్ టైమ్ ఎంతో కూడా తెలిపాడు. నవంబర్ 24న రెండున్నర గంటల సినిమా నుంచి రెండున్నర నిమిషాలు ప్రేక్షకులకు చూపించబోతున్నామని ట్వీట్ చేశాడు. అంటే రెండున్నర నిమిషాల ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించాడు.

ఇప్పటికే రాజకీయ నాయకుడిగా ఈ సినిమా గురించి నాని చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తెలంగాణ సీఎ కేసీఆర్, టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రెస్‌ మీట్లను అనుకరిస్తూ చేసిన వీడియోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ సినిమా గురించి జనం మాట్లాడేలా చేయడంలో నాని సూపర్ సక్సెస్ అయ్యాడు.

గత చిత్రం ‘దసరా’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న నాని అదే ఊపులో ‘హాయ్ నాన్న' చిత్రంలో నటించాడు. ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందింది. తండ్రీ-కుమార్తెల సెంటిమెంట్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి శౌర్యువ్‌ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్‌ నటిస్తుండగా.. శ్రుతి హాసన్ కీలకపాత్ర పోషిసున్నారు. ఈ సినిమా తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందని నాని తెలిపాడు.

More News

Chiranjeevi: ఆ మాటలు అసహ్యంగా వున్నాయి.. త్రిషకి అండగా నిలబడతా: చిరంజీవి

అగ్ర కథానాయిక త్రిషపై కోలీవుడ్ సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై పరిశ్రమలకు అతీతంగా అందరూ స్పందిస్తున్నారు.

YS Jagan: వర్షాల కారణంగా సీఎం జగన్ సూళ్లూరుపేట పర్యటన రద్దు

ఏపీ సీఎం జగన్ తిరుపతి జిల్లా పర్యటన రద్దైంది. మత్స్యకార దినోత్సవం సందర్భంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయాల్సి ఉంది.

Bigg Boss Telugu 7: ప్రశాంత్, గౌతమ్ మధ్య 'పంచె' పెట్టిన చిచ్చు.. అశ్విని షాకింగ్ డెసిషన్

బిగ్‌బాస్ 7 తెలుగు ఉత్కంఠగా సాగుతోంది. ఈ ఆదివారం నో ఎలిమినేషన్ అంటూ నాగార్జున షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరు దక్కించుకోకపోవడంతో ఈ

IT Raids: మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ దాడులు.. కార్యకర్తలు ఆందోళన

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల నేతలకు ఐటీ దాడులు కలవరం పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఎవరి ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తారనే భయంతో ఉన్నారు.

Chandrababu: చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంకోర్టుకు సీఐడీ అధికారులు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.