Hi Nanna Trailer: 'హాయ్ నాన్న' ట్రైలర్ విడుదలకు ముహుర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన తాజా సినిమా 'హాయ్ నాన్న'. డిసెంబర్ 7న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో చేస్తున్నాడు నాని. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సీజన్ కావడంతో రాజకీయ నాయకుడిలా మారి తన సినిమాపై హైప్ తీసుకొస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నామో ప్రకటించాడు. అలాగే ఈ మూవీ రన్ టైమ్ ఎంతో కూడా తెలిపాడు. నవంబర్ 24న రెండున్నర గంటల సినిమా నుంచి రెండున్నర నిమిషాలు ప్రేక్షకులకు చూపించబోతున్నామని ట్వీట్ చేశాడు. అంటే రెండున్నర నిమిషాల ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించాడు.
ఇప్పటికే రాజకీయ నాయకుడిగా ఈ సినిమా గురించి నాని చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తెలంగాణ సీఎ కేసీఆర్, టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రెస్ మీట్లను అనుకరిస్తూ చేసిన వీడియోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ సినిమా గురించి జనం మాట్లాడేలా చేయడంలో నాని సూపర్ సక్సెస్ అయ్యాడు.
గత చిత్రం ‘దసరా’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న నాని అదే ఊపులో ‘హాయ్ నాన్న' చిత్రంలో నటించాడు. ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందింది. తండ్రీ-కుమార్తెల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తుండగా.. శ్రుతి హాసన్ కీలకపాత్ర పోషిసున్నారు. ఈ సినిమా తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందని నాని తెలిపాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com