'హేయ్‌..పిల్ల‌గాడ' సెన్సార్ పూర్తి, అక్టోబ‌ర్‌లో విడుద‌ల

  • IndiaGlitz, [Wednesday,October 04 2017]

'ఓకే.. బంగారం' సినిమాతో దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఇటీవ‌ల విడుద‌లైన సెన్సేష‌న‌ల్ హిట్ అయిన 'ఫిదా'తో భానుమ‌తిగా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన సాయిప‌ల్ల‌వి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా 'క‌లి'. ఈ సినిమాను సూరెడ్డి గోపాలకృష్ణ(యు.ఎస్‌.ఎ) స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మీ చెన్న‌కేశ‌వ ఫిలింస్ ప‌తాకంపై 'హేయ్‌.. పిల్ల‌గాడ' అనే పేరుతో తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. డి.వి.కృష్ణ‌స్వామి నిర్మాత‌. స‌మీర్ తాహిర్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. అక్టోబ‌ర్ నెల‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా.... నిర్మాత డి.వి.కృష్ణ‌స్వామి మాట్లాడుతూ - "ఓకే బంగారం దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఫిదా సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం 'క‌లి'. మ‌ల‌యాళం,త‌మిళంలో సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు తెలుగులో విడుద‌ల 'హేయ్‌..పిల్ల‌గాడ‌' పేరుతో తెలుగులో మా ల‌క్ష్మీ చెన్న కేశ‌వ పిలింస్ బ్యాన‌ర్‌పై విడుద‌ల చేస్తున్నాం. ఇదొక టిపిక‌ల్ ల‌వ్‌స్టోరీ. దుల్క‌ర్‌, సాయిప‌ల్ల‌వి మ‌ధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ 'యు' స‌ర్టిఫికేట్ పొందింది. గోపీసుంద‌ర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, గిరీష్ గంగాధ‌ర‌న్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. సినిమాను ఈ అక్టోబ‌ర్ నెల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణః సూరెడ్డి గోపాలకృష్ణ(యు.ఎస్‌.ఎ), మాట‌లుః భాషా శ్రీ, సాహిత్యంః సురేంద్ర కృష్ణ‌, సంగీతంః గోపీసుంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీః గిరీష్ గంగాధ‌ర‌న్‌, నిర్మాతః డి.వి.కృష్ణ‌స్వామి, ద‌ర్శ‌క‌త్వంః స‌మీర్ తాహిర్‌.

More News

రామోజీ ఫిల్మ్ సిటీ లో... పిల్లలతో సందడి చేసిన హీరో సునీల్

కమెడియన్ గా తెలుగు ప్రేక్షకుల్ని  ఎంటర్ టైన్ చేసి  టాలీవుడ్ హీరోగా సుస్థిర స్తానం సంపాదించుకున్న సునీల్ మరో సారి తన దాతృత్వాన్ని చూపించాడు. తన వంతు గా ఎప్పుడు ఎవరు సాయం అడిగిన వారికి హెల్ప్ చేయడం ఆయన నైజం.

మెగాస్టార్ 'డాడీ'కి 16 ఏళ్లు

మాస్టర్ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తరువాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సురేష్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన చిత్రం డాడీ. మాస్టర్ చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్ సంస్థనే ఈ చిత్రాన్ని కూడా నిర్మించడం విశేషం.

నాలుగోసారి కూడా క‌లిసొస్తుందా?

చిన్న చిత్రాల్లో న‌టించినప్ప‌టికీ.. మంచి క్రేజ్‌నే మూట‌గ‌ట్టుకుంది యంగ్ హీరోయిన్ హెబా ప‌టేల్‌. అలా ఎలాతో తెలుగులో కెరీర్‌ని ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ కి ఆ చిత్రం మంచి విజ‌యాన్నే అందించింది. ఆ త‌రువాత వ‌చ్చిన కుమారి 21 ఎఫ్‌, ఈడో ర‌కం ఆడో ర‌కం, ఎక్క‌డికి పోతావ్ చిన్న‌వాడా కూడా స‌క్సెస్ అవ‌డంతో.. హెబా గోల్డెన్ లెగ్ అనిపించుకుంది.

నారా రోహిత్ 'బాల‌కృష్ణుడు' షూటింగ్ పూర్తి

స‌ర‌శ్చంద్రిక విజ‌న‌రీ మోష‌న్ పిక్చ‌ర్స్, మాయా బ‌జార్ మూవీస్ ప‌తాకాల‌పై విల‌క్ష‌ణ న‌టుడు నారా రోహిత్‌, డెబ్యూ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ మ‌ల్లెల కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'బాల‌కృష్ణుడు'. బి.మ‌హేంద్ర‌బాబు, ముసునూను వంశీ, శ్రీ వినోద్ నంద‌మూరి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నవంబర్ 3న రాబోతున్న విజువల్ వండర్ 'ఏంజెల్'

శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై  నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ 'ఏంజెల్'. సోషియో ఫాంటసీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకి రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకుడు. ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి పర్యవేక్షణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా రూపొందుతోంది.