నవంబ‌ర్ 24న 'హేయ్ ..పిల్ల‌గాడ‌'

  • IndiaGlitz, [Friday,November 10 2017]

'ఓకే.. బంగారం' స‌క్సెస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గరైన క‌థానాయ‌కుడు దుల్క‌ర్ స‌ల్మాన్‌. ఇప్పుడు స్ట్ర‌యిట్ తెలుగు మూవీ మ‌హాన‌టిలో సావిత్రి భ‌ర్త జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. కెరీర్ ప్రారంభం నుండి విల‌క్ష‌ణ‌మైన సినిమాల్లో న‌ట‌స్తూ, మెప్పిస్తున్న దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా..అందం, అభిన‌యం క‌ల‌గ‌ల‌సిన భానుమ‌తి పాత్ర‌తో గిలిగింత‌లు పెట్టి ప్రేక్ష‌కుల‌ను త‌న‌కు 'ఫిదా' అయ్యేలా చేసుకుని ప్ర‌స్తుతం ఎం.సి.ఎ, క‌ణం చిత్రాల‌తో మెప్పించ‌నున్న సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించిన చిత్రం 'హేయ్.. పిల్ల‌గాడ‌'.

మ‌ల‌యాళంలో 27 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి సెన్సేష‌న‌ల్ హిట్ అయిన చిత్రం 'క‌లి'ని సూరెడ్డి గోపాలకృష్ణ(యు.ఎస్‌.ఎ) స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మీ చెన్న‌కేశ‌వ ఫిలింస్ ప‌తాకంపై 'హేయ్‌.. పిల్ల‌గాడ' అనే పేరుతో తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. డి.వి.కృష్ణ‌స్వామి నిర్మాత‌. స‌మీర్ తాహిర్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా న‌వంబ‌ర్ 24న విడుద‌ల కానుంది.

ఈ సంద‌ర్భంగా.... చిత్ర స‌మ‌ర్ప‌కుడు సూరెడ్డి గోపాల‌కృష్ణ మాట్లాడుతూ "మ‌ల‌యాళం, త‌మిళంలో విజ‌య‌వంత‌మైన 'క‌లి' చిత్రాన్ని తెలుగులో 'హేయ్‌..పిల్ల‌గాడ‌' పేరుతో తెలుగులో విడుద‌ల చేస్తున్నాం. దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి..ఇద్దరూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులే. 'హేయ్..పిల్ల‌గాడ' ఇదొక టిపిక‌ల్ ల‌వ్‌స్టోరీ. దుల్క‌ర్‌, సాయిప‌ల్ల‌వి మ‌ధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయి. గోపీసుంద‌ర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, గిరీష్ గంగాధ‌ర‌న్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. సినిమాను న‌వంబ‌ర్ 24న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం" అన్నారు.

ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణః సూరెడ్డి గోపాలకృష్ణ(యు.ఎస్‌.ఎ), మాట‌లుః భాషా శ్రీ, సాహిత్యంః సురేంద్ర కృష్ణ‌, సంగీతంః గోపీసుంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీః గిరీష్ గంగాధ‌ర‌న్‌, నిర్మాతః డి.వి.కృష్ణ‌ .

More News

'ఖాకి' పాటలకు అద్భుతమైన స్పందన

అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే చాలు అని అంటారు. పెళ్లి ముందు జరిగే నిశ్చితార్థాన్ని బట్టి పెళ్లి ఎంత ఘనంగా ఉండబోతోందో అంచనా వేయొచ్చంటారు.

మ‌నోజ్‌కి ఆరు నెల‌లు రెస్ట్‌

మంచు మనోజ్ హీరోగా రేపు రిలీజ్ కాబోతున్న చిత్రం 'ఒక్కడు మిగిలాడు'. ఈ సంద‌ర్భంగా మ‌నోజ్ మాట్లాడుతూ "ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, రొమాన్స్, కామెడీ ఏ విధమైన హంగులు లేని సినిమా.

ప్ర‌ముఖ కెమెరామెన్ క‌న్న‌మూత‌...

సూర్య, హ‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన సింగం సిరీస్ సినిమాల‌కు సూర్య‌, హ‌రిల‌కు ఎంత మంచి పేరొచ్చిందో..సినిమాటోగ్రాఫ‌ర్ ప్రియ‌న్‌కి కూడా అంతే మంచి పేరు వ‌చ్చింది.

'లండన్ బాబులు' షూటింగ్ పూర్తి

ఎప్పటిక‌ప్పుడు మంచి కాన్సెప్ట్ ల‌తో లిమిటెడ్ బ‌డ్జెట్ లో క్వాలిటిగా చిత్రాల‌ను నిర్మిస్తున్న మారుతి టాకీస్ బ్యాన‌ర్ పై నిర్మించిన చిత్రం లండ‌న్ బాబులు.

'జవాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వివరాలు

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా , బివిఎస్ రవి దర్శకత్వం చేసిన చిత్రం జవాన్. ఈ చిత్రం ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.