Aadikeshava:'ఆదికేశవ' చిత్రం నుంచి హే బుజ్జి బంగారం సాంగ్ విడుదల

  • IndiaGlitz, [Wednesday,October 11 2023]

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, అందాల బామ శ్రీలీల హీరోయిన్‌గా తెరెకెక్కుతున్న చిత్రం 'ఆదికేశవ'. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్ అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి 'హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా' అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ యూత్‌ను ఆకట్టుకునేలా మంచి హుషారుగా సాగుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ ఈ మూవీకి సంగీతం అందించగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తు్న్నారు.

మైనింగ్ దోపిడీ నేపథ్యంలో తెరకెక్కిన ఆదికేశవ..

తొలిసారిగా పవర్ఫుల్ టైటిల్‌తో.. పవర్ఫుల్ పాత్రలో వైష్ణవ్ ఈ సినిమా చేశాడు. మైనింగ్ దోపిడీ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది. మైనింగ్‌ చేసేందుకు అడ్డుగా ఉందనే కారణంతో శివాలయాన్ని కూల్చడానికి విలన్ ప్రయత్నించడం ఆ ప్రయత్నా్న్ని హీరో అడ్డుకోవడమే ఈ చిత్రం కథాంశం అని చెబుతున్నారు. రాధిక శరత్ కుమార్, అపర్ణ దాస్, జోజు జార్జ్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. నవంబర్ 10వ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఉప్పెనతో బ్లాక్‌బాస్టర్ డెబ్యూ ఇచ్చిన వైష్ణవ్..

తొలి సినిమా 'ఉప్పెన'తోనే బ్లాక్ బస్టర్ కొట్టిన వైష్ణవ్ తేజ్.. తర్వాత నటించిన చిత్రాలు మాత్రం అంత ఆదరణ పొందలేకపోయాయి. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన 'కొండపొలం' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ కమర్షియల్‌గా మాత్రం విజయం సాధించలేదు. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'రంగ రంగ వైభవంగా' చిత్రం కూడా తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో 'ఆదికేశవ' చిత్రంతో మళ్లీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని వైష్ణవ్ తహతహలాడుతున్నాడు. అందుకు తగ్గట్లే మంచి యాక్షన్ కథను సెలెక్ట్ చేసున్నాడు. మరి ఈ చిత్రం ఏ మేరకు విజయం అందిస్తుందో వేచి చూడాలి.

More News

KCR: మరోసారి సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్న గులాబీ బాస్.. అక్కడి నుంచే ప్రచారం షురూ

గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌కు సెంటిమెంట్‌లు ఎక్కువ అని అందరికీ తెలిసిందే. ఆయన ఏ పని చేయాలన్నా ముహుర్త బలాన్ని నమ్ముతుంటారు.

Nadendla:టోఫెల్ శిక్షణ పేరుతో వేల కోట్ల రూపాయల లూటీకి ప్రభుత్వం సిద్ధమైంది: నాదెండ్ల

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు టోఫెల్ శిక్షణ పేరుతో వైసీపీ ప్రభుత్వం లూటీకి తెరతీసిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. సీఐడీ నమోదు చేసిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, పుంగనూరు అంగళ్లు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Vyooham, Shapadham:ఆర్జీవీ వ్యూహం, శపథం సినిమాల విడుదల ఎప్పుడంటే..?

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఏపీ సీఎం జగన్ జీవితం ఆధారంగా తీసిన రెండు సినిమాల విడుదల తేదిని ప్రకటించాడు.

AP Government: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. సర్కార్ పోస్టులకు వయోపరిమితి పెంపు

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. పోటీపరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగుల వయోపరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.