త్రివిక్రమ్ వారి చేతే చెప్పిస్తున్నాడు

  • IndiaGlitz, [Friday,December 08 2017]

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ సినిమాల్లో.. క‌థానాయిక‌ల పాత్ర‌లు కేవ‌లం వినోదం కోసం అన్న‌ట్లుగానే ఉంటుంటాయి. ఒక్క నువ్వే నువ్వే లో మిన‌హాయిస్తే.. ప్ర‌తి సినిమాలోనూ ఇదే శైలి క‌నిపిస్తుంది. ఆయ‌న రాసే ఆ మాట‌ల‌తో క‌థానాయిక‌ల‌కు మంచి పేరే వ‌చ్చింది కూడా.

ఇదిలా ఉంటే.. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రం నుంచి త్రివిక్ర‌మ్ సినిమాల‌ను గ‌మ‌నిస్తే.. ఓ విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మవుతుంది. అదేమిటంటే.. ఆయ‌న సినిమాల్లో కేర‌ళ‌కుట్టిలు వ‌రుస‌గా న‌టించ‌డం. అలాగే వారి పాత్ర‌ల‌కు వారే డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం.

స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో నిత్యా మీన‌న్ న‌టించ‌డ‌మే కాకుండా.. డ‌బ్బింగ్ చెప్పుకుంది. అఆతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కూడా.. తొలి చిత్రంతోనే డ‌బ్బింగ్ చెప్పుకుంది. ఇప్పుడు త్రివిక్ర‌మ్ తాజా చిత్రం అజ్ఞాత‌వాసిలోనూ సేమ్ టు సేమ్‌. ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తున్న మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌లు కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ కూడా డ‌బ్బింగ్ చెప్పుకుంటున్నారు.

మ‌రి.. మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌ల విష‌యంలోనే.. త్రివిక్ర‌మ్ డ‌బ్బింగ్ చెప్పించ‌డంలో ఆంత‌ర్య‌మేమిటో?

More News

ప్ర‌వీణ్ స‌త్తారు మ‌ల్టీస్టార‌ర్ మూవీ

'చందమామ కథలు' సినిమాతో నేషనల్ అవార్డును గెలుచుకున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. తాజాగా 'పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ప్రవీణ్. దాదాపు 10 సంవత్సరాలుగా విజయం కోసం పరితపిస్తున్న డా.

షూటింగ్ పూర్తి చేసుకున్న'ఏంసీఏ'..డిసెంబ‌ర్ 21న విడుద‌ల‌

నేచుర‌ల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్నసినిమా 'ఎం.సి.ఎ'. దిల్‌రాజు 'ఫిదా' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు భానుమ‌తిగా ప‌రిచ‌య‌మైన సాయిప‌ల్ల‌వి ఎం.సి.ఎలో హీరోయిన్‌గా న‌టించింది.

'అజ్ఞాత‌వాసి` సెకండ్ సింగిల్ డేట్‌, ఆడియో డేట్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూడో చిత్రంగా 'అజ్ఞాతవాసి' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుపుకుంటోంది.

శర్వానంద్ సినిమా తప్పుకున్న నిత్యా?

‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్. ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలతో నటిగా తానేంటో నిరూపించుకుంది ఈ కేరళకుట్టి.

స‌మంత‌.. డ‌బుల్ ధ‌మాకా

యువ క‌థానాయకుడు నాగ‌చైత‌న్య‌ని ఇటీవ‌లే పెళ్లి చేసుకున్న స‌మంత‌.. మ‌ళ్లీ సినిమాల‌తో బిజీగా మారింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమాలు చేస్తోంది.