త్రివిక్రమ్ వారి చేతే చెప్పిస్తున్నాడు
Send us your feedback to audioarticles@vaarta.com
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో.. కథానాయికల పాత్రలు కేవలం వినోదం కోసం అన్నట్లుగానే ఉంటుంటాయి. ఒక్క నువ్వే నువ్వే లో మినహాయిస్తే.. ప్రతి సినిమాలోనూ ఇదే శైలి కనిపిస్తుంది. ఆయన రాసే ఆ మాటలతో కథానాయికలకు మంచి పేరే వచ్చింది కూడా.
ఇదిలా ఉంటే.. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి త్రివిక్రమ్ సినిమాలను గమనిస్తే.. ఓ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదేమిటంటే.. ఆయన సినిమాల్లో కేరళకుట్టిలు వరుసగా నటించడం. అలాగే వారి పాత్రలకు వారే డబ్బింగ్ చెప్పుకోవడం.
సన్నాఫ్ సత్యమూర్తిలో నిత్యా మీనన్ నటించడమే కాకుండా.. డబ్బింగ్ చెప్పుకుంది. అఆతో తెలుగు తెరకు పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ కూడా.. తొలి చిత్రంతోనే డబ్బింగ్ చెప్పుకుంది. ఇప్పుడు త్రివిక్రమ్ తాజా చిత్రం అజ్ఞాతవాసిలోనూ సేమ్ టు సేమ్. ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్న మలయాళ ముద్దుగుమ్మలు కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ కూడా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.
మరి.. మలయాళ ముద్దుగుమ్మల విషయంలోనే.. త్రివిక్రమ్ డబ్బింగ్ చెప్పించడంలో ఆంతర్యమేమిటో?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments