కొత్త పలుకులు పలకనున్న ముద్దుగుమ్ములు
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకప్పుడు తెలుగు సినిమాలంటే తెలుగు హీరోయిన్స్ మాత్రమే నటించేవారు. కానీ ఓ దశకంలో ఉత్తరాదిన భామలు, ఇతర దక్షిణాది సినీ పరిశ్రమలు(తమిళ, కన్నడ, మలయాళ)కు చెందిన ముద్దుగుమ్మలు నటించారు. అయితే వీరందరూ ఇతరులతో డబ్బింగ్ చెప్పించుకుని తన కెరీర్‌ను సాగించారు. కానీ ఇప్పుడు ఇతర భాషలకు చెందిన హీరోయిన్స్ మాత్రం అలా ఉండటం లేదు. వారు తమ ఐడెంటిటీని నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ఏ భాషలో నటిస్తే ఆ భాషను నేర్చుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.
ఇలా కొత్త భాషల్లో కొత్త పలుకులు నేర్చుకోవాలనుకుంటున్న హీరోయిన్స్‌కు లాక్డౌన్ వల్ల దొరికిన ఖాళీ సమయం బాగానే ఉపయోగపడుతుందట. తమన్నా గుజరాతీ అమ్మాయి అయినప్పటికీ హిందీ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ భాషలను నేర్చుకుంది. ఇది ఆమెను మన ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేలా చేసింది. ఇప్పుడు ఈమె బాటలోనే మరో హీరోయిన్ కొత్త భాష నేర్చుకోవడానికి ఆసక్తిని చూపుతుందట. ఆమె ఎవరో కాదు.. నిధి అగర్వాల్. తెలుగులో హీరోయిన్గా నటిస్తున్న నిధి అగర్వాల్ ఇప్పుడు తమిళంలోకి అడుగు పెట్టింది. తెలుగును ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న నిధి అగర్వాల్ ఇప్పుడు తమిళాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పదాలను రాసుకుని వాటిని తమిళంలో ఎలా పలకాలో నేర్చకుంటున్నానని నిధి అగర్వాల్ చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments