హీరోయిన్గా కంటే విలనిజంపైనే ఆసక్తి చూపుతున్న ముద్దుగుమ్మలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండస్ట్రీలో లేడీ విలన్స్‌కు ఇంపార్టెన్స్ పెరుగుతోంది. స్టార్ హీరోయిన్లు సైతం విలన్స్‌గా మారి మెప్పిస్తున్నారు. నాటి రమ్యకృష్ణ నుంచి నేటి సమంత వరకూ విలన్‌గా నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అవుతున్నారు. విలన్‌గా నటించి ఆ తరువాత హీరోయిన్స్‌గా నటిస్తున్నప్పటికీ ప్రేక్షకుల్లో వారికున్న క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడంతో ముద్దుగుమ్మలు సైతం విలన్స్‌గా నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హీరోయిన్గా కంటే విలన్‌గా నటనకు మరింత స్కోప్ ఉండటం కూడా బ్యూటీలు విలన్‌గా నటించేందుకు ఓ కారణం.
‘నరసింహ’ సినిమాలో రమ్యకృష్ణ విలన్‌గా తన నటనతో దుమ్మురేపారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్లో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో తన నటనకు రమ్యకృష్ణ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నారు. ‘సీమరాజా’ సినిమాతో సిమ్రాన్ సైతం విలన్‌గా నటించి మెప్పించారు. ‘ఒరేయ్ నేను చీరకట్టిన మగాడినిరా’ అంటూ ఆమె చేసిన పెర్ఫార్మెన్స్ ఎంత చెప్పినా తక్కువే. బ్యూటీకి, సౌమ్యానికి ఐకాన్‌గా ఉండే సౌందర్య సైతం విలన్‌గా మెప్పించారు. ‘నా మనసిస్తా రా’ సినిమాలో విలన్‌గా సౌందర్య నూటికి నూరు మార్కులు వేయించుకున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ సైతం.. ‘సీత’ సినిమాలో విలన్‌గా నటించి మెప్పించింది.
‘పొగరు’ సినిమాలో ప్రముఖ నటి శ్రియారెడ్డి విలన్‌గా నటించి అబ్బురపరిచారు. విమర్శకుల ప్రశంసలను సైతం శ్రియారెడ్డి అందుకున్నారు. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ ప్రారంభంలోనే విలన్ రోల్లో నటించి మెప్పించింది. ‘ఎవరు’ మూవీలో రెజీనా తన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసింది. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ రోల్స్‌కు పెట్టింది పేరుగా మారిపోయింది. ఆర్ఎక్స్-100తో అందాల భామ పాయల్ రాజ్‌పుత్ విలన్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక అక్కినేని వారి కోడలు సమంత కూడా విలన్‌గా మెప్పించబోతోంది. అయితే ఆమె సినిమాలో కాదులెండి.. వెబ్ సిరీస్‌లో విలన్‌గా మెప్పించబోతోంది. ‘ఫ్యామిలీ మ్యాన్’ సీక్వెల్లో సమంత విలన్‌గా మెప్పించబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 1 ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. త్వరలోనే సీక్వెల్ 2 కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సీక్వెల్‌కి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com