ఈ ఏడాదిలో డబ్బింగ్‌తో ఆకట్టుకున్న కథానాయికలు
Send us your feedback to audioarticles@vaarta.com
తొలితరం అగ్ర కథానాయికల దగ్గర నుంచి.. ఆ తర్వాత తరంలో వచ్చిన శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి అగ్ర కథానాయికల వరకు వారి పాత్రలకి వారే డబ్బింగ్ చెప్పుకునేవారు. కాని ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. 80, 90వ దశకంలో రాధ, విజయశాంతి హవా మొదలైనప్పటి నుంచి.. నిన్నటితరం హీరోయిన్లైన సౌందర్య, సిమ్రాన్ వరకు అంతా డబ్బింగ్ కళాకారుల మీదే ఆధారపడ్డవారే. కాని ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో క్రమంగా మార్పు వస్తోంది. ఇప్పటి యువ కథానాయికలంతా పరభాషకు చెందిన తారలైనా సరే.. తెలుగులో గొంతు సవరించుకోవడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు.
ఈ ఏడాదైతే.. తమ సొంత గొంతుని ప్రేక్షకులకి వినిపించిన వారి జాబితా బాగానే ఉంది. ఈ విషయంలో..ముందు వరుసలో ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్. అవడానికి కేరళ కుట్టి అయినా.. తెలుగులో చక్కగా డబ్బింగ్ చెప్పుకుంటోంది కీర్తి. సావిత్రి జీవిత కథగా తెరకెక్కిన ‘మహానటి’ కోసం ఆమె ఎప్పటినుంచో హోమ్‌వర్క్ ప్రారంభించింది. అందులో భాగంగానే ‘అజ్ఞాతవాసి’ సినిమాలో తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకుంది. దాని వలన ‘మహానటి’ సినిమాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకోగలిగింది. ఈమెతో కలిసి ‘అజ్ఞాతవాసి’ సినిమాలో నటించిన మరో నాయిక అను ఇమ్మాన్యుయేల్ కూడా ఆ సినిమాలో తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకుంది. అలాగే.. హరిప్రియ(‘జై సింహా’), సమంత(‘మహానటి’)తో పాటు.. టాలీవుడ్లో తొలిసారి అడుగుపెట్టిన నాయికలైన రష్మిక మందన్న(‘ఛలో’), సంయుక్త హెగ్డే’(‘కిర్రాక్ పార్టీ’), అదితిరావ్ హైదరి(‘సమ్మోహనం’) తొలిసారిగా గొంతు సవరించుకున్నారు. మరి.. ఈ ఏడాదిలో ఇంకెంతమంది కథానాయికలు ఈ జాబితాలో చేరుతారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout