త‌ల్లుల్ని లాగుతున్న నాయిక‌లు

  • IndiaGlitz, [Thursday,May 02 2019]

సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్స్ పెరిగాక ఎవ‌రి నోటి వెంట ఏం వినాల్సి వ‌స్తుందో అన్న‌ట్టు త‌యారైంది ప‌రిస్థితి. అందులోనూ హీరోయిన్ల‌యితే మ‌రీ... ఎవ‌రేమ‌న్నా స‌రే... వెంట‌నే 'మీ అమ్మ కూడా అలాగేనా' అని త‌ల్లి ప్ర‌స్తావ‌న తీసుకొస్తున్నారు. ఆ మ‌ధ్య ర‌కుల్ కారులో నుంచి దిగుతూ ఉన్న ఫొటోలో అర్ధ‌నగ్నంగా ఉన్న‌ట్టు క‌నిపించింది. ఆమెను ఉద్దేశించి ఒక నెటిజ‌న్ పెట్టిన కామెంట్‌కు ఆమె 'మీ అమ్మ‌కు ఈ సెష‌న్స్ గురించి బాగా తెలుస్తుంది' అని విరుచుకుప‌డింది.

వెంట‌నే ఆమెను కొంద‌రు నెటిజ‌న్లు త‌ప్పుప‌ట్టారు. దానికి సంబంధించి ఆమె త‌న‌వంతుగా వివ‌ర‌ణ ఇచ్చుకుంది. తాజాగా మ‌రో హీరోయిన్ ఓవియా కూడా 'మీ అమ్మ ఐట‌మ్‌' అని అన‌డంతో దుమారం రేగింది. ఆమె స‌ర‌దాగా త‌న అభిమానుల‌తో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.

ఒక‌రు ఆమెను పెళ్లిచేసుకోమ‌ని అడ‌గ్గా మ‌రో వ్యక్తి 'ఆమె పెద్ద ఐట‌మ్‌' అని అన్నాడు. దాంతో ఆమె తీవ్రంగా స్పందించింది. 'మీ అమ్మ పెద్ద ఐట‌మ్' అని అత‌న్ని ఉద్దేశించి చెప్పింది. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్‌. లేటెస్ట్ గా ఓవియా హీరో శింబుతో ప్రేమ‌లో ఉన్న విష‌యం తెలిసిందే