ఐ లవ్ యూ చెబితే ప్రభాస్‌కే అంటున్న హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏదైనా డేరింగ్ అండ్ డాషింగ్‌గా మాట్లాడే హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ మరోసారి తనదైన వ్యాఖ్యలతో వార్తల్లోనిలిచారు. కేవలం హీరోయిన్‌గానే సినిమాలు చేస్తానని కాకుండా .. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ప్రతి నాయికగా.. ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది.
మొన్నటి వరకు విశాల్‌ను పెళ్లి చేసుకుంటుందని వార్తల్లో నిలిచింది. అయితే విశాల్‌కు అనీషా అనే అమ్మాయితో పెళ్లి కుదరడంతో ఈ వార్తలకు చెక్ పడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని.. ఒకవేళ ఐలవ్యూ చెప్పాలనుకుంటే తనకే చెబుతానంటూ చెప్పి అందరికీ ఓ రకంగా షాకిచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments